ఆర్‌బి‌ఐ పాత రూ.5 కాయిన్ ఎందుకు ఆగిపోయింది..? దీని వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందా..!

Published : Feb 28, 2023, 11:26 AM IST
ఆర్‌బి‌ఐ పాత రూ.5 కాయిన్ ఎందుకు ఆగిపోయింది..? దీని వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందా..!

సారాంశం

ప్రస్తుతం బంగారం రంగు రూ.5  నాణేలు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. దీనికి కారణం తెలిస్తే మీకు షాక్ గ్యారెంటీ. భారతదేశపు పాత రూ.5 డినామినేషన్ నాణేలను స్మగ్లర్లు బంగ్లాదేశ్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో రూ.5 విలువ కలిగిన పాత నాణేల చలామణి తగ్గింది. 

బిజినెస్ డెస్క్:  రూ.5 విలువ కలిగిన పాత నాణేల చెలామణిలో భారీ తగ్గుదలని మీరు గమనించి ఉండవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాణేలు, నోట్ల ముద్రణకు సంబంధించి తరచుగా మార్పులు చేస్తుంది. ఇంకా నకిలీ నోట్లను నియంత్రించడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి RBI తరచుగా ఈ చర్య తీసుకుంటుంది. అలాగే రూ. 5 నాణెం ఆకృతి కూడా మార్చబడింది. కానీ, ఈ మార్పు వెనుక కారణం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం.

అంతేకాదు రూ.2 వేలు రూ. 5 విలువ కలిగిన నోట్ల ముద్రణ కూడా నిలిచిపోయింది. పాత  నాణేల ఉత్పత్తిని కూడా ఆర్‌బీఐ నిలిపివేసింది. ఈ పాత రూ. 5 విలువ కలిగిన నాణేల తయారీలో 9 గ్రాముల బరువున్న కుప్రో-నికెల్‌ను ఉపయోగించారు. ఇప్పుడు మీ వాలెట్‌లో 5 రూపాయల కొత్త నాణేన్ని చూడండి, దీని బరువు పాత రూ.5 నాణెం కంటే తక్కువ ఇంకా సన్నగా కనిపిస్తుంది.  ఈ విధంగా రూ.5 నాణెం స్వభావం ఒక్కసారిగా మారడానికి కారణం ఎంటో తెలుసా...

ప్రస్తుతం బంగారం రంగు రూ.5  నాణేలు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. దీనికి కారణం తెలిస్తే మీకు షాక్ గ్యారెంటీ. భారతదేశపు పాత రూ.5 డినామినేషన్ నాణేలను స్మగ్లర్లు బంగ్లాదేశ్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో రూ.5 విలువ కలిగిన పాత నాణేల చలామణి తగ్గింది. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో ఈ నాణెంని కరిగించి దాని నుండి రేజర్ బ్లేడ్‌లను తయారు చేస్తున్నారు.  రూ.5 విలువ కలిగిన ఒక నాణెంతో 6 బ్లేడ్‌ల వరకు తయారుచేయవచ్చు. ఒక్కో బ్లేడ్ ధర రూ.2 అంటే 6 బ్లేడ్లతో రూ.12 సంపాదించవచ్చు 

 రూ.5 విలువ కలిగిన నాణేలను అక్రమంగా బంగ్లాదేశ్‌లోకి తరలించే అంశం తెరపైకి రావడంతో భారత ప్రభుత్వం నాణేల స్వరూపాన్ని, వాటిలో ఉపయోగించే లోహాన్ని మార్చేసింది. RBI రూ.5  నాణేలు పాత నాణేల కంటే సన్నగా తయారు చేయబడ్డాయి. అలాగే దానిలో ఉపయోగించిన మెటల్ తక్కువ ఖరీదైన మూలకాలతో కలుపుతారు. తద్వారా కొత్త రూ.5 నాణేలను అక్రమంగా బంగ్లాదేశ్‌లోకి తరలించినా, వాటిని రేజర్ బ్లేడ్‌ల తయారీకి ఉపయోగించలేరు. 

కొత్త రూ.5 నాణెంతో పోలిస్తే పాత నాణెం నాణ్యత మెరుగ్గా ఉంటుంది. పాత నాణేల్లో వాడే కుప్రో నికెల్ మెటల్ కాస్త ఖరీదైనది కావడంతో పాత రూ.5. నాణెం మరింత విలువైనది. ఈ నాణేన్ని కరిగించి విక్రయిస్తే రూ.5కు పైగానే లభిస్తుంది. ఈ కారణంగా పాత రూ.5 నాణేల దుర్వినియోగం విచ్చలవిడిగా సాగింది. నాణెం విలువకు, అందులో ఉపయోగించే లోహం విలువకు తేడా ఉంటుంది. లోహం మార్కెట్ విలువ మారుతున్న కొద్దీ, నాణెంలో ఉపయోగించే మెటల్ విలువ కూడా మారుతుంది. 

కొత్త రూ.5 నాణెం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ తక్కువ బరువు ఉంటుంది. దీని తయారీలో తక్కువ ఖర్చుతో కూడిన లోహాలను ఉపయోగిస్తారు. కాబట్టి ఈ నాణెం ఇతర లాభదాయకమైన ఉత్పత్తులను తయారు చేయడానికి కరిగించబడదు. ఇలా మార్కెట్ లో కొత్త రూ.5. నాణేల చలామణి తగ్గే అవకాశం కూడా లేదు.

PREV
click me!

Recommended Stories

Gold rate: 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుంది?
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌