బంగారం, వెండికి భలే గిరాకీ.. నిన్న, మొన్నటితో పోల్చితే నేడు పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

Published : Feb 28, 2023, 10:05 AM IST
బంగారం, వెండికి భలే గిరాకీ.. నిన్న, మొన్నటితో పోల్చితే నేడు పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

సారాంశం

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.160 తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.56,020 వద్ద ట్రేడవుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది. మరోవైపు  వెండి ధర రూ.700 తగ్గగా, 1 కేజీ వెండి ధర రూ.67,800 వద్ద ఉంది.  

బంగారం, వెండి కొనేందుకు మంచి సమయం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. గతకొంత కాలంగా తార స్థాయికి చేరిన ధరలు ప్రస్తుతం దిగోస్తున్నాయి. రెండు రోజుల నుండి పసిడి ధరలు మరింత తగ్గాయి. అయితే గత 10 రోజులలో బంగారం, వెండి ధరలు ఒక్కసారి మాత్రమే పెరగడం గమనార్హం. 

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.160 తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.56,020 వద్ద ట్రేడవుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది. మరోవైపు  వెండి ధర రూ.700 తగ్గగా, 1 కేజీ వెండి ధర రూ.67,800 వద్ద ఉంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.51,350 నుంచి రూ.150 తగ్గింది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ఇంకా హైదరాబాద్‌ బంగారం ధరతో సమానంగా రూ.51,350 వద్ద ఉంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.51,500, బెంగళూరులో రూ.51,400, చెన్నైలో రూ.52,010గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ బంగారం ధరతో సమానంగా రూ.56,020 వద్ద ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.56,170, బెంగళూరులో రూ.56,070, చెన్నైలో రూ.56,740గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో  రూ.69,000 గా ఉంది. 

మైసూరులో  22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070గా ఉంది. పుణెలో  22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,020గా ఉంది.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1818 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర $20.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌‍తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.645 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం ధర ధర 10 గ్రాములకు రూ.60 తగ్గి రూ.24,170 కి చేరింది. సోమవారం రెండు నెలల కనిష్టానికి చేరిన తర్వాత 0052 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఔన్సుకు $1,816.33 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $1,824.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే