
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004లో జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. కానీ 2009లో ప్రైవేట్ రంగానికి విస్తరించారు. అంటే ఇప్పుడు ఏ ఉద్యోగి అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్ పెట్టుబడికి చాలా మంచిదని భావిస్తారు. ఇందులో మీ డబ్బును కోల్పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఇంకా మంచి రాబడిని కూడా ఇస్తుంది. జీతం పొందే ఎవరైనా ఈ పథకంలో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు. దీని తర్వాత పదవీ విరమణ వయస్సులో మీరు పెద్ద ఫండ్ పొందుతారు.
సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం ఇది. పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం ఈ పథకంలో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు చేయబడుతున్నాయి, తద్వారా ప్రజలు దాని ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. ఈ పథకంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఇప్పటివరకు అనేక మార్పులను ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం...
75 ఏళ్లపాటు ఖాతా అమల్లో
60 ఏళ్ల తర్వాత ఈ పథకంలోని సబ్‌స్క్రైబర్‌లకు PFRDA పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పుడు 75 ఏళ్ల వయస్సు వరకు పెన్షన్ విధానంలో తమ ఖాతాను కొనసాగించవచ్చు. అంతేకాకుండా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలకు పెంచబడింది. అంటే ఇప్పుడు 70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ పథకంలో 2 లక్షల కంటే తక్కువ పెన్షన్ నిధులు ఉన్నవారు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే రూ.5 లక్షల లోపు ఉన్న పింఛను నిధుల కోసం కూడా ఇలాంటి సన్నాహాలు జరుగుతున్నాయని, తద్వారా వారు పూర్తి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ తెలిపింది.
జాతీయ పెన్షన్ పథకం ప్రయోజనాలు
18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద పదవీ విరమణ వయస్సులో మీరు పెద్ద మొత్తం ఫండ్ పొందుతారు. దీనితో పాటు మీరు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల కొంత పెన్షన్ మొత్తాన్ని కూడా పొందుతారు. 60 ఏళ్లు దాటిన 83% ఎన్‌పిఎస్ చందాదారులు మెచ్యూరిటీకి మించి పెట్టుబడులు పెట్టడాన్ని ఎంచుకుంటున్నారని ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది .