క్రిప్టోకరెన్సీలపై మరో పెద్ద దెబ్బ.. మరికొద్దిరోజుల్లో కఠినమైన నిబంధనలను అమలు..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2022, 12:08 AM IST
క్రిప్టోకరెన్సీలపై మరో పెద్ద దెబ్బ.. మరికొద్దిరోజుల్లో కఠినమైన నిబంధనలను అమలు..

సారాంశం

ఇలాంటి నియమాలు ఇతర ఏ‌ఎస్‌ఈ‌ఏఎన్ సభ్య దేశాలలో కూడా అమలు చేయబడ్డాయి. వీటిలో బ్రూనై, ఇండోనేషియా, మలేషియా ఉన్నాయి. సింగపూర్, వియత్నాంలో బిట్‌కాయిన్‌కు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, అక్కడి కేంద్ర బ్యాంకులు దీని ద్వారా చెల్లింపులను నిషేధించాయని చెబుతున్నారు.

క్రిప్టోకరెన్సీల వినియోగంపై కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టే దేశాలలో ఇప్పుడు థాయిలాండ్ కూడా చేరబోతుంది.  అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్  (ASEAN)తో అనుబంధం ఉన్న చాలా దేశాలు ఇప్పటికే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీటి కింద క్రిప్టోకరెన్సీలను లైసెన్స్ పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే ట్రేడ్ చేయవచ్చు లేదా దాని ద్వారా చెల్లించవచ్చు.

పడిపోతున్న బిట్‌కాయిన్  
నివేదికల ప్రకారం, థాయిలాండ్‌లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ చాలా విస్తరించింది. ప్రస్తుతానికి అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధరలో తగ్గుదలలో ఉంది. గత కొన్ని నెలలుగా బిట్‌కాయిన్ ధరలో వేగవంతమైన అస్థిరత థాయ్‌లాండ్‌లోని అధికారులను తాజా చర్య తీసుకోవడానికి ప్రేరేపించిందని పరిశీలకులు అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్ (BOT) గత నెలలో డిజిటల్ నాణేల ధరలో అస్థిరత అనేది కొనుగోలుదారులు, విక్రేతలకు భారీ నష్టాలను కలిగించే సమస్య అని పేర్కొంది.

వార్తల ప్రకారం, క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఈ నెల రెండవ వారంలో అమలులోకి వస్తాయి. అంతకంటే ముందు ఫిబ్రవరి 8న ఈ నిబంధనలను జారీ చేసి వాటిపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తారు. ఒక వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం ప్రతిపాదిత నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా విధించే నిబంధనను కూడా రూపొందించారు. నిబంధనలను ఉల్లంఘించి క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసిన లేదా విక్రయించిన వారికి తొమ్మిది వేల అమెరికన్ డాలర్ల వరకు అంటే సుమారు 6 లక్షలకు పైగానే జరిమానా విధించబడుతుంది.

ఇలాంటి నియమాలు ఇటీవల  ఎన్నో ఇతర ASEAN సభ్య దేశాలలో కూడా అమలు చేయబడ్డాయి. వీటిలో బ్రూనై, ఇండోనేషియా, మలేషియా ఉన్నాయి. సింగపూర్, వియత్నాంలో బిట్‌కాయిన్‌కు మంచి ఆదరణ ఉందని చెబుతున్నప్పటికీ, అక్కడి సెంట్రల్ బ్యాంకులు దీని ద్వారా చెల్లింపులను నిషేధించాయి. డిజిటల్ నాణేల ట్రేడింగ్‌లో నేరుగా పాల్గొనరాదని బ్యాంక్ ఆఫ్ థాయ్ లాండ్ (BOT) గత డిసెంబర్‌లో వాణిజ్య బ్యాంకులను హెచ్చరించింది.

అయినప్పటికీ బ్యాంక్ ఆఫ్ థాయ్ లాండ్, థాయిలాండ్  సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఇప్పటికీ లైసెన్స్ పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ను అనుమతిస్తాయి. SEC అటువంటి లైసెన్స్‌లను జారీ చేస్తుంది. ప్రస్తుతం, థాయిలాండ్‌లో ఇటువంటి క్రిప్టో ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లు ఎనిమిది ఉన్నాయి. వాటిలో అతిపెద్దది కిట్‌కుబ్. థాయ్‌లాండ్‌లోని పురాతన బ్యాంక్ సియామ్ కమర్షియల్ బ్యాంక్ గత నవంబర్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది.

క్రిప్టో వ్యాపారుల సంఘం అయిన థాయ్ డిజిటల్ అసెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరెస్ లాపన్నరాయ్ వెబ్‌సైట్ నిక్కీ ఆసియాతో మాట్లాడుతూ – 'బ్యాంక్ ఆఫ్ థాయ్ లాండ్  తాజా ప్రకటన పెద్ద కంపెనీలను ఒత్తిడికి గురి చేసింది. వీటిలో క్రిప్టో వ్యాపారంలో పెద్ద పెట్టుబడులను ప్రకటించిన అన్ని కంపెనీలను ఉన్నాయి.

బీఓటీ కొత్త నిబంధనల వల్ల పెద్ద కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిబంధనలు క్రిప్టోకరెన్సీల ప్రజాదరణపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీంతో వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే భారీగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బిట్‌కాయిన్ కూడా డౌన్‌ట్రెండ్‌లో ఉంది. గత నవంబర్‌లో ఒక నాణెం ధర 68 వేలు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్