RBI Reschedules MPC: ఆర్బీఐ MPC సమావేశం వాయిదా.. కార‌ణ‌మిదే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 12:33 PM IST
RBI Reschedules MPC: ఆర్బీఐ MPC సమావేశం వాయిదా.. కార‌ణ‌మిదే..?

సారాంశం

ఆర్బీఐ పరపతి సమావేశం కోసం వేచి చూస్తున్నారు. ఈసారి MPC సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థిక రికవరీ కనిపించడంతో క్రమంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నియంత్రించేది ఆర్బీఐ.

గానకోకిల, భారతరత్న లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సోమవారం సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆ రాష్ట్రంలో అన్ని బ్రాంచీలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆర్బీఐ నేటి నుండి ప్రారంభం కావాల్సిన మానిటరీ పాలసీ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది. MPC సమావేశాన్ని రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు ఆర్బీఐ ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన సమావేశం మంగళవారం (ఫిబ్ర‌వరి 8) ప్రారంభమవుతుంది.

వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం
ఆర్బీఐ పరపతి సమావేశం కోసం వేచి చూస్తున్నారు. ఈసారి MPC సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థిక రికవరీ కనిపించడంతో క్రమంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నియంత్రించేది ఆర్బీఐ. ప్రతి మూడు నెలలకోసారి జరిగే సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుుంది. ఈసారి జరగనున్న సమీక్షలో ఆ వడ్డీ రేట్లు పెరగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం అంటే 2021-22కు సంబంధించి చివరి త్రైమాసిక సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఈ సమీక్షను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్వహించనుంది. ఈ సమీక్షలో వడ్డీ రేట్లపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన వడ్డీ రేట్లను పెంచేందుకు ఆర్బీఐ యోచిస్తోందని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్ క్లేస్ అంచనా వేసింది. 

రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర బడ్జెట్ లో సమీకరణ పరిమాణాన్ని పెంచినందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తానికి వడ్డీ రేట్లు పావు శాతం పెంచనుంది ఆర్బీఐ (RBI). పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐ సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి పెంచకపోయినా, వచ్చేసారి పెంచేందుకు హింట్ ఇవ్వచ్చునని భావిస్తున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు ఎంపీసీ సమావేశం ఉంటుంది. గురువారం నాడు ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తారు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్