
ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో నడిచే రైళ్లలో ఎన్నో రకాలు ఉంటాయి. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, కొత్తగా వచ్చిన వందే భారత్. అయితే మన దేశంలో రైళ్లు వివిధ రంగుల్లో ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఏ రంగు దేనిని సూచిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? రైలు రంగు ఆధారంగా అది ఏ క్యాటగిరీకి చెందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వేల్లో ఎక్కువగా కనిపించే రంగు నీలం. ఇది సాధారణ మైలు (Mail), ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉపయోగిస్తారు. ఇందులో టికెట్ ధరలు చవకగానే ఉంటాయి.
ఈ రైళ్లు వేగంగా నడుస్తాయి, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి. వందే భారత్, శతాబ్ది, దురంతో వంటివి ఈ విభాగంలో వస్తాయి. ఇవి ఎక్కువగా రిజర్వేషన్ కలిగిన ప్రయాణికుల కోసం కేటాయిస్తారు.
ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగిన రైళ్లు. వేగంగా సాగుతూ దేశ రాజధాని న్యూఢిల్లీకి అనుసంధానమవుతాయి. రెడ్ కలర్ ఈ రైళ్లకు ప్రాముఖ్యతను సూచిస్తుంది. రాజధాని రైలుద దీనికి ఒక ఉదాహరణ.
ఈ రైళ్లు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ప్రయాణించే వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. “అందరికీ అందుబాటులో ఉండే AC రైలు” అనే ఉద్దేశంతో ప్రారంభించారు. రంగు కూడా వినూత్నంగా ఉండేలా ఎంచుకున్నారు.
కొన్ని రైళ్లు ప్రయోగాత్మకంగా, లేదా ప్రాంతీయ అవసరాల మేరకు ప్రత్యేక రంగుల్లో ఉంటాయి. ఉదాహరణకు లోకల్ ట్రైన్స్ పసుపు-లేత నీలం కలర్‌లో ఉంటాయి.
ఒక్కో ప్రయాణికుడి అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. అందుకే, ఒక్కో రైలు ఒక్కో విధంగా ఉండేలా రంగులను వాడారు. ఈ రంగుల ద్వారా మీరు… రైలు రకం త్వరగా గుర్తించవచ్చు. ఏ రైలు మీకు అనుకూలమో ఎంచుకోవచ్చు. భారత రైల్వేలోని ప్రణాళికను అర్థం చేసుకోవచ్చు.