తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Cherokee: లాంగ్ గ్యాప్ తర్వాత మార్కెట్‌లోకి చెరోకీ: ఈ సారి హైబ్రిడ్ మోడల్‌గా వచ్చేస్తోంది

Naga Surya Phani Kumar | Published : May 31, 2025 9:41 PM

అమెరికన్ SUV తయారీ దిగ్గజం జీప్ తమ ప్రసిద్ధి గాంచిన చెరోకీ మోడల్‌ను 2026లో కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్, ఆధునిక డిజైన్‌తో తిరిగి ప్రవేశపెట్టనుంది. ఈ జీప్ విశేషాలు తెలుసుకుందాం రండి. 

కొత్తగా మళ్లీ మార్కెట్ లోకి చెరోకీ

2023లో మార్కెట్ నుంచి తాత్కాలికంగా తప్పుకున్న చెరోకీ ఇప్పుడు మళ్లీ కొత్త డిజైన్ తో మార్కెట్ లోకి వచ్చేస్తోంది. ఈసారి చెరోకీకి STLA లార్జ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా తీసుకున్నారు. దీనివల్ల హైబ్రిడ్, పెట్రోల్, ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్స్ అంటూ కస్టమర్లు, మార్కెట్ల అవసరాలకి అనుగుణంగా విడుదల చేసే అవకాశం ఉంది.

క్లాసిక్ జీప్ ఆకృతిలో చెరోకీ డిజైన్ ఉంది. దీని నిర్మాణంలోనూ 7-స్లాట్ గ్రిల్ ఉపయోగిస్తున్నారు. ఇక లుక్ విషయానికొస్తే స్లీక్ రెక్టాంగులర్ హెడ్‌లైట్లు, ఆకర్షణీయ టర్న్ ఇండికేటర్లు ఈ జీప్ కి కొత్త లుక్ తీసుకొచ్చాయి. బంపర్‌ పై బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ ఆక్సెంట్లు కారు క్లాస్‌ లుక్ ని ఇచ్చాయి.

స్పోర్టీ లుక్ లో చెరోకీ జీప్

చూడటానికి కారు మరింత స్పోర్టీగా కనిపించేందుకు బ్లాక్‌డ్ రూఫ్, పెద్ద అలాయ్ వీల్స్ చాలా బాగున్నాయి. ముందు ‘Cherokee’ తన బ్రాండింగ్ ను తెలియజేస్తోంది. అయితే వెనుక భాగంలో వైడ్ LED లైట్ బార్ ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

మార్కెట్ లోకి మొదట వచ్చేది హైబ్రిడ్  

చెరోకీ 2026 హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో మొదట విడుదల కానుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ + ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో వస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

ఎలక్ట్రిక్ వేరియంట్: వ్యాగనార్ S టెక్నాలజీని ఇందులో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇది డ్యూయల్ మోటార్, 100kWh బ్యాటరీ, 600hp కన్నా తక్కువ పవర్ తో నడుస్తుంది. 

పెట్రోల్ వేరియంట్: పెట్రోల్ వేరియంట్ లో  3.0 లీటర్ హరికేన్ ట్విన్ టర్బో ఇన్‌లైన్-6 ఇంజిన్ ఉపయోగిస్తారు. టాప్ ట్రిమ్‌లో 548hp వరకు ఎనర్జీని జనరేట్ చేస్తుంది. 

లేటెస్ట్ ఇంటీరియర్ వివరాలు 

అఫీషియల్ గా ఇంటీరియర్ వివరాలు వెలువడకపోయినా ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, టచ్‌బార్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్ఇలు ఉంటాయని సమాచారం. ఇవన్నీ కలిపి చెరోకీని మరింత ఆధునికంగా మారుస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది 2025 ఎండింగ్ లో కాని, 2026 స్టార్టింగ్ లో కాని గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

Read more Articles on
click me!