ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలను ప్రకటించిన విజిల్‌ డ్రైవ్ సంస్థ...

By Sandra Ashok KumarFirst Published Apr 16, 2020, 6:40 PM IST
Highlights

విజిల్‌ డ్రైవ్ వ్యవస్థాపకుడు సిఇఒ రాకేశ్ మున్నూరు మాట్లాడుతూ “విజిల్‌డ్రైవ్ వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఏప్రిల్‌లో క్యాబీకి 5వేల  రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది 

హైదరాబాద్ : భారత దేశంలోని నాలుగు ప్రధాన  నగరాల్లో వ్యాపించి  దాదాపు 800 పైగా పెరుగుతున్న క్యాబ్స్ నెట్‌వర్క్‌ ఇప్పుడు  హైదరాబాద్‌కు చెందిన ఉద్యోగుల రవాణా సంస్థ విజిల్‌ డ్రైవ్ వడ్డీ లేని రుణాలును ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణేలలో పనిచేస్తున్న సంస్థ కూడా కంపెనీలో కోవిడ్ -19 సంబంధిత లే అఫ్ఫ్ ఉండవని ప్రకటించింది.
 
విజిల్‌ డ్రైవ్ వ్యవస్థాపకుడు సిఇఒ రాకేశ్ మున్నూరు మాట్లాడుతూ “విజిల్‌డ్రైవ్ వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఏప్రిల్‌లో ఒక క్యాబీకి 5వేల  రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది అలాగే వారి ఉద్యోగం కూడా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. అంతే కాదు ఇప్పటికే 65% క్యాబ్ భాగస్వాములకు సహాయపడింది.” అని అన్నారు.
 
ఇంకా, విజిల్‌డ్రైవ్ తన ఖాతాదారులకు క్యాబ్ భాగస్వాములకు మద్దతునిచ్చే విధంగా ప్రాథమిక చెల్లింపులు చేయమని అభ్యర్థించింది ఇంకా ఉద్యోగుల తొలగింపులు లేదా వేతనాల్లో  కోతలు ఉండవని మేము హామీ ఇస్తున్నాము అని రాకేశ్ చెప్పారు.
 
విజిల్‌ డ్రైవ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగుల రవాణా సంస్థ, ఇది ఫ్లీట్, ప్లస్ టెక్నాలజీ, కార్పొరేట్ ఉద్యోగుల రవాణాకు ఆన్-గ్రౌండ్ సపోర్ట్ అందిస్తుంది. ఇది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణేలలో పనిచేస్తుంది, ప్రతిరోజూ 25వేల మంది ఉద్యోగులు ప్రయనించడానికి 800పైగా క్యాబ్ల సముదాయం ద్వారా సేవలను అందిస్తుంది.

also read కరోనా ఎఫెక్ట్: దివాళాదశలో హోటల్స్ రంగం... మారటోరియం పెంచాలని అభ్యర్థన


కరోనా వైరస్  వ్యాప్తిని ఎదుర్కోవటానికి, విజిల్‌ డ్రైవ్ ఉద్యోగులు, డ్రైవర్లు, క్లయింట్లు ఉత్తమమైన పద్ధతులను అనుసరించడానికి చేయవలసిన పనుల గురించి ప్రచారం కూడా  చేసింది. ప్రతి క్యాబ్‌లో డ్రైవర్లు ఫేస్ మాస్క్, శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరి చేయడం ఇందులో ఉంది. సంస్థ వారి డ్రైవర్లందరికీ వారి క్లయింట్లకు సాధారణ ఉష్ణోగ్రత చెక్ అప్ అమలు చేసింది. క్లయింట్లు, ఉద్యోగులు, క్యాబ్‌లు డ్రైవర్లకు సంబంధించిన వెల్‌నెస్ చెక్‌లపై రియల్ టైమ్  సమాచారాన్ని, వాటిని నిర్ధారించడానికి వారు టెక్నాలజి ఫీచర్ కూడా రూపొందించారు.
 
పోస్ట్ లాక్ డౌన్ సమయంలో కూడా అదే భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను అనుసరించనుంది. అందరికీ ఫేస్ మాస్క్, ప్రతి వాహనంలో శానిటైజర్  ఉపయోగించడం తప్పనిసరి చేస్తుంది. రాకేశ్ మున్నూరు 2016లో దీనిని స్థాపించారు. హైదరాబాద్ లోని  ప్రధాన కార్యాలయ సంస్థ, వరల్డ్ ఇన్నోవేటర్స్ మీట్ 2019లో నెక్స్ట్ గ్లోబల్ టెక్ 50తో సహా పలు అవార్డులు & గుర్తింపులను అందుకుంది.

click me!