Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: దివాళాదశలో హోటల్స్ రంగం... మారటోరియం పెంచాలని అభ్యర్థన

కరోనా మహమ్మారి ప్రభావాన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల భారీగా నష్టపోయింది హోటల్స్ (ఆతిథ్యరంగమే). రుణ చెల్లింపులపై ఆర్బీఐ విధించిన మూడు నెలల మారటోరియం 12 నెలలకు పెంచాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.
 

Disastrous impact on hospitality sector, govt support needed: Industry on lockdown
Author
Hyderabad, First Published Apr 16, 2020, 2:15 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఎక్కువగా ఆతిథ్యరంగం భారీగా నష్టపోయింది. వివిధ దేశాలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను అమలు చేస్తుండడంతో ఎక్కడిక్కడ ప్రయాణాలు నిలిచిపోయాయి. హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. 

ఇండియన్‌‌‌‌ హోటల్‌‌‌‌ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. హోటల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లకు క్యాపిటల్‌‌‌‌, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వానీ అన్నారు. క్యాపిటల్‌‌‌‌ కోసం అప్పులు, వీటిపైన వడ్డీలు పెరుగుతాయని అన్నారు. 

వీటికి తోడుగా హోటళ్లలో ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ పన్నులు, మినిమమ్‌‌‌‌ లోడ్‌‌‌‌ ఛార్జీలు వంటివి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉంటాయని లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వానీ పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి ఇండియన్‌‌‌‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఆక్యుపెన్సీ రేట్ 65–70 శాతం వరకు ఉండేదని అన్నారు. 

మార్చి నెల నుంచి ఆక్యుపెన్సీ కనిష్ట స్థాయికి పడిపోయిందని లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వానీ తెలిపారు. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇండియాలో హోటల్స్‌‌‌‌ ఆక్యుపెన్సీ మరింత పడిపోతుందని, దీంతో హోటళ్లు షట్‌‌‌‌డౌన్‌‌‌‌ లేదా లిమిటెడ్‌‌‌‌గా నడవడమో జరుగుతుందని అభివర్ణించారు. దీంతో పాటు ఉద్యోగులను తొలగించొద్దని, శాలరీలను కట్‌‌‌‌ చేయొద్దని ప్రభుత్వం కోరిందని, దీనికి నిధుల సమస్య ఉంటుందన్నారు.

also read చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ...పరిస్థితులు ఇలాగే కొనసాగితే..

ఇలాంటి పరిస్థితులలో హోల్డింగ్‌‌‌‌ కంపెనీ వంటి ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ సోర్సెస్‌‌‌‌ నుంచి క్యాపిటల్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ లేకపోతే కష్టమని లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వానీ తెలిపారు. మూడు నెలల మారటోరియం ప్రకటించి ప్రభుత్వం మంచి పనిచేసిందని అన్నారు.

కానీ ఈ టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ చాలా తక్కువని, 12 నెలల మారటోరియం ప్రకటించుకుంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం నుంచి కనీస మద్ధతును హోటల్‌‌‌‌ ఇండస్ట్రీ ఆశిస్తోందని లెమన్‌‌‌‌ ట్రీ హోటల్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పతంజలి జీ కేశ్వానీ పేర్కొన్నారు. పన్నులను మాఫీ చేయడం, శాలరీలు చెల్లించడంలో సపోర్ట్‌‌‌‌ వంటివి ఇండస్ట్రీకి అవసరమన్నారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో కేంద్రం విధించిన లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో హోటల్‌‌‌‌ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోందని సిగ్నెట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ ఎండీ సర్బేంద్ర సర్కారీ అన్నారు. హోటల్ రిజర్వేషన్లు పడిపోయాయని, క్యాన్సిలేషన్లు పెరిగాయని చెప్పారు. ఆర్బీఐ ప్రకటించిన 3 నెలల మారటోరియం ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్‌‌‌‌ అని చెప్పారు.ఇలాంటి చర్యలను ప్రభుత్వం మరిన్ని ప్రకటించాలని కోరారు.

గతేడాది 95 శాతం ఆక్యుపెన్సీ ఉండేదని, కరోనా దెబ్బతో ప్రస్తుతం ఇది ఐదు శాతానికి పడిపోయిందని  బర్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరక్టర్‌‌‌‌‌‌‌‌ అంకూర్‌‌‌‌‌‌‌‌ భాటియా అన్నారు. కరోనా దెబ్బతో ముఖ్యంగా హోటల్‌‌‌‌, టూరిజం ఇండస్ట్రీ నష్టపోతోందని చెప్పారు.

వివిధ దేశాలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ప్రకటించడంతో ట్రావెల్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా నష్టపోతోందని అమత్రా హోటల్స్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌ దువే అన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం.. హాస్పిటాలిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు పెద్ద రిలీఫ్‌‌‌‌ అని అన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దేశంలో ఈ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios