కరోనా కట్టడే లక్ష్యం:ఇమ్యూనేషన్ పెంచుకోండి.. ఆయుష్ శాఖ అడ్వైజ్

By narsimha lode  |  First Published Apr 12, 2020, 11:15 AM IST

కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. మనదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్నది. 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. మనదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్నది. 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తోంది. 

Latest Videos

ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దేశ ప్రజలకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ పలు సూచనలను చేసింది. ఆ సూచనలు ఏమిటన్నది తెలుసుకుందాం.. 

ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. రోజువారీగా వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష తదితరాలతో తయారు చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటికి రెండు సార్లు తాగండి. అలాగే మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూన్ పసుపు కలుపుకుని రోజుకు ఒకసారి గానీ, రెండు సార్లు గానీ తాగాలి. నువ్వుల నూనె/ కొబ్బరి నూనె / నెయ్యిని ముక్కు రంద్రాల కింద పట్టించండి. దీన్ని ఉదయం, సాయంత్రం చేయండి.

also read:ఈ నెలలో 20 కోట్ల క్లోరోక్వీన్ మాత్రల ఉత్పత్తి.. అమెరికాకు వచ్చేవారం సప్లయి

ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె / కొబ్బరి నూనె తీసుకుని నోటిలో వేసుకుని రెండు మూడు నిమిషాలు పుక్కిలించి తర్వాత ఉమ్మివేయాలి. ఆ తర్వాత వెంటనే నోటిని గోరువెచ్చని నీటితో పరిశుభ్రం చేసుకోవాలని రోజూ ఒకటి రెండు సార్లు చేయొచ్చు.

పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోంపు గింజలను కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి. లవంగాల పొడిని బెల్లంతో గానీ, తేనెతో గానీ కలుపుకుని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ దగ్గు ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని ప్రజలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించింది. 
 

click me!