ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడ ఉంది..ఇక్కడ ప్రజలు ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాకే..?

By Krishna Adithya  |  First Published Jun 22, 2023, 2:28 AM IST

ఆసియాలోని అత్యంత ధనిక గ్రామం మదవాగ్ హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నివసించే అన్ని కుటుంబాలు దాదాపు కోటీశ్వరులే. ఈ కుటుంబాలు బంగారం-వెండి లేదా వజ్రాల వ్యాపారులు అనుకుంటే పొరపాటే, వీరు డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.


ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మారిన హిమాచల్ ప్రదేశ్‌లోని మదవాగ్ గ్రామం గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ గ్రామంలోని అన్ని కుటుంబాల వారు కోట్లకు పడగెత్తారు. ఈ కుటుంబాలు బంగారం-వెండి లేదా వజ్రాల వ్యాపారులు కాదు. వారంతా సామాన్య రైతులు. నాణ్యమైన ఆపిల్‌ పంటను పండించడం ద్వారా  ఇప్పుడు వారంతా విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. ఆసియాలోని అత్యంత ధనిక గ్రామం మదవాగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలోని చౌపాల్ తాలూకాలో సిమ్లా నుండి 90 కి.మీ. దూరంలో ఉంది. 

మదవాగ్ గ్రామ ప్రజల జీవన విధానం

Latest Videos

మాదవాగ్ గ్రామంలో సుమారు 230 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఖరీదైన లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలు కనిపిస్తాయి. ఇంట్లో ఉండే అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఇక్కడ నివసించే వారంతా కోటీశ్వరులే.

మాదవాగ్ రైతుల వార్షిక ఆదాయం

మాదవాగ్ గ్రామ రైతులు నాణ్యమైన యాపిల్ పండిస్తున్నారు. ఇక్కడ 230 కుటుంబాలు నివసిస్తున్నాయి. యాపిల్ సాగు ద్వారా ప్రజలందరూ ఏటా 150 నుంచి 175 కోట్ల విలువైన యాపిల్‌లను విక్రయిస్తున్నారు. ఇక్కడ అన్ని కుటుంబాల వార్షికాదాయం 35 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉంటుంది.

మాదవాగ్ గ్రామంలో యాపిల్ సాగు చరిత్ర

హిమాచల్ ప్రదేశ్‌లోని మదవాగ్ గ్రామంలో 1953-54కు ముందు ఆ గ్రామ రైతులు బంగాళదుంపలు పండించేవారు. చైయాన్ రామ్ మెహతా అనే రైతు యాపిల్ సాగు ప్రారంభించాడు. బుద్ధిసింగ్, కనా సింగ్ డోగ్రాల సలహా మేరకు చైయా రామ్ మెహతా యాపిల్ తోటను నాటారు. వారు విజయం సాధించారు.  మంచి ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించారు, తర్వాత ఇతర గ్రామ ప్రజలు కూడా చైయిన్ రామ్ మెహతా మార్గదర్శకత్వంలో ఆపిల్ సాగును ప్రారంభించారు, సుమారు 1980 నాటికి గ్రామంలోని దాదాపు అన్ని వ్యవసాయ కుటుంబాలు యాపిల్ సాగులో నిమగ్నమయ్యాయి.  

మదవాగ్ యాపిల్‌కు దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది

మాదవాగ్ రైతులు తమ కష్టార్జితంతో నాణ్యమైన యాపిల్స్‌ను పండించారు, నేడు ఈ గ్రామంలోని యాపిల్స్‌కు ప్రపంచంలోనే అధిక డిమాండ్‌ ఉంది.ఇక్కడి రైతులు ప్రస్తుతం హై డెన్సిటీ ప్లాంటేషన్ (హెచ్‌డిపి) వంటి ఆధునిక సాంకేతికతతో యాపిల్‌ను సాగు చేస్తున్నారు.

మదవాగ్‌కు ముందు క్యారీ గ్రామం ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం

మదవాగ్ కంటే ముందు సిమ్లా జిల్లాలోని క్యారీ గ్రామం ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా ఉండేది. ఈ గ్రామం కూడా ఆపిల్ సాగు చేయడం ద్వారానే ధనిక గ్రామంగా పేరు పొందింది. ఇప్పుడు మదవాగ్ గ్రామం ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ప్రస్తుతం మదవాగ్ సమీపంలోని దషోలి గ్రామం కూడా నాణ్యమైన యాపిల్స్ సాగులో తనదైన ముద్ర వేస్తోంది. దషోలి గ్రామంలోని కుటుంబాలు దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆపిల్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. 

click me!