చదువుకున్న కాలేజీకి ఏకంగా 400 కోట్ల విరాళం ఇచ్చిన ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి ఆస్తుల విలువ ఎంతంటే..?

By Krishna Adithya  |  First Published Jun 22, 2023, 12:59 AM IST

ఇన్ఫోసిస్ నందన్ నీలేకని ఐఐటీ-బాంబేకి 400 కోట్ల విరాళం ఇవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాను చదువుకున్న కాలేజీకి ఏకంగా రూ. 400 కోట్ల విరాళం అందించిన నందన్ నీలేఖని వద్ద అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. నిజానికి నందన్ నీలేకణి వద్ద ఉన్న ఆస్తుల విలువ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, నందన్ నీలేకని ఐఐటీ-బాంబేకు రూ.315 కోట్ల విరాళం ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన నందన్ నీలేకణి 1973లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.  అయితే గతంలో నందన్ నీలేకణి  85 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇలా మొత్తం 400 కోట్లు విరాళం అందించారు. ఈ డబ్బుతో ఐఐటీ బాంబేలో కొత్త హాస్టళ్లను నిర్మించడంతో పాటు స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిధులను వినియోగించనున్నారు. తాను చదువుకున్న కాలేజీకే ఏకంగా రూ. 400 కోట్ల విరాళం అందించిన నందన్ నీలేకణి అసలు ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం.

నందన్ నీలేకణి భారతీయ పారిశ్రామికవేత్తల జాబితాలో అగ్రశ్రేణికి చెందిన వారు.  ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఏడుగురు సహ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 2002 నుండి 2007 వరకు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీకి CEO గా పనిచేసిన నందన్ నీలేకణి  ప్రస్తుతం కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. నందన్ నీలేకణి  ఆధార్ ప్రధాన రూపకర్తగా కూడా గుర్తింపు పొందారు. అతను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చైర్మన్ కూడా వ్యవహరించారు. 

Latest Videos

నందన్ నీలేకణి  బ్యాక్ గ్రౌండ్ ఇదే..

నందన్ నీలేకణి  కొంకణి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆయన తన ప్రాథమిక విద్యను బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్, సెయింట్ జోసెఫ్ హై స్కూల్, కర్నాటక నుండి పూర్తి చేశాడు. అతను ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 1978లో, నందన్ నీలేకణి  ముంబైకి చెందిన పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో పనిచేశాడు, అక్కడ అతను NR నారాయణ మూర్తిని కలిశాడు.

గత సంవత్సరం, ఇన్ఫోసిస్ సంస్థ 40 సంవత్సరాల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఓ  కార్యక్రమంలో నారాయణ మూర్తి నందన్ నీలేకణి  గురించి ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. నందన్ నీలేకణి  పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ (PCS)లో సాఫ్ట్‌వేర్ హెడ్‌గా పనిచేస్తున్నప్పుడు, నారాయణ మూర్తి తన 'లెర్నింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్' తీసుకున్నారు. నారాయణ మూర్తి డెవలప్ చేసిన ఐక్యూ పరీక్షను నందన్ ఒక నిమిషంలో సాల్వ్ చేశాడు.

దీనిపై నారాయణ మూర్తి మాట్లాడుతూ, "నేను మ్యాట్రిక్స్ సైకిల్ అనే IQ పరీక్షను అభివృద్ధి చేసాను. నిజంగా తెలివైన వ్యక్తులు దీన్ని ఒకటిన్నర నిమిషాల్లో చేస్తారు.  కాస్త తెలివైన వ్యక్తులు 5 నిమిషాల్లో చేస్తారు, నందన్ నీలేకణి  దీనిని ఒక నిమిషంలో చేసాడని గుర్తు చేసుకున్నారు.  

నందన్ నీలేకణి  2009లో ఇన్ఫోసిస్‌ను విడిచిపెట్టి 2017లో తిరిగి కంపెనీ బోర్డులోకి వచ్చారు. ప్రస్తుతం, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) గవర్నర్ల బోర్డు సభ్యుడు NCAER ఛైర్మన్ గా ఉన్నారు. 

నందన్ నీలేకణి  కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన గెలవలేదు. ఫోర్బ్స్ ప్రకారం, నందన్ నీలేకణి  ప్రస్తుత ఆస్తుల నికర విలువ రూ.21,453 కోట్లుగా ఉంది. 

click me!