
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారి నుండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఒక భాగం. ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ టెక్నికల్, సైన్స్ విభాగాల్లో మొత్తం 147 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. స్పేస్ సెంటర్ లో వర్క్ చేస్తూ దేశ స్పేస్ రీసెర్చ్‌కి తోడ్పడాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం.
ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ విద్యార్హతలు ఉన్న వారికి వివిధ రకాల ఉద్యోగాలున్నాయి.
టెక్నీషియన్ – B (ఫిట్టర్): 56 ఖాళీలు ఉన్నాయి. SSLC/SSC/10వ తరగతి పాస్, సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC/NAC చేసి ఉండాలి.
డ్రాట్స్‌మన్-B: 7 ఖాళీలు ఉన్నాయి. SSLC/SSC/10వ తరగతి పాస్, సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC/NAC చేసి ఉండాలి.
ఫార్మసిస్ట్ – A: 1 ఖాళీ ఉంది. SSLC/SSC పాస్, ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: 1 ఖాళీ ఉంది. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్: 1 ఖాళీ ఉంది. దీనికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
లైబ్రరీ అసిస్టెంట్: 1 పోస్టు ఖాళీ ఉంది. దీనికి డిగ్రీ, లైబ్రరీ సైన్స్/లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (M.Lib.I.Sc) అయి ఉండాలి.
టెక్నీషియన్ – B, డ్రాట్స్‌మన్-B పోస్టులకు నెలకు రూ.21,700 – రూ.69,100/- జీతం ఇస్తారు. ఫార్మసిస్ట్ – Aకి రూ.29,200 – రూ.92,300/-, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌లకు రూ.44,900 – రూ.1,42,400/- వరకు జీతం చెల్లిస్తారు.
అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, PwBD (Gen/EWS)కి 10 ఏళ్లు, PwBD (SC/ST)కి 15 ఏళ్లు, PwBD (OBC)కి 13 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఉద్యోగం బట్టి దరఖాస్తు ఫీజు మారుతుంది.
టెక్నీషియన్ – B, డ్రాట్స్‌మన్-B, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ST/SC/Ex-s/PWD వారైతే రూ.500/- చెల్లించాలి. మిగతావారు కూడా రూ.500/- చెల్లించాలి. కాని ఎంపిక విధానంలో భాగంగా కొంత ఫీజు తిరిగి ఇస్తారు.
TA, SA & లైబ్రరీ అసిస్టెంట్–A ఉద్యోగాలకైతే ST/SC/Ex-s/PWD, జనరల్ అభ్యర్థులు అందరూ రూ.750/- చెల్లించాలి. కాని ఎంపిక విధానంలో భాగంగా కొంత ఫీజు తిరిగి ఇస్తారు. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 02, 2025. చివరి తేదీ జూన్ 18, 2025.
అర్హులైన అభ్యర్థులు VSSC వెబ్‌సైట్ www.vssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు చూసుకోండి.