WhatsApp AI: వాట్సాప్‌లో మీ స్నేహితులతో మాట్లాడి బోర్ కొట్టిందా? అయితే AI ఫ్రెండ్‌తో మాట్లాడండి

Published : Jun 06, 2025, 09:00 PM IST
WhatsApp AI: వాట్సాప్‌లో మీ స్నేహితులతో మాట్లాడి బోర్ కొట్టిందా? అయితే AI ఫ్రెండ్‌తో మాట్లాడండి

సారాంశం

వాట్సాప్‌లో ఆఫీస్, బిజినెస్ మెసేజ్‌లు, చాట్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడటం లేదు కదా.. అందుకే వినియోగదారుల కోసం వాట్సాప్ లో AI ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. ఈ కొత్త ఫీచర్‌ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం రండి.

మనలో చాలా మంది వాట్సాప్ ఇప్పుడు ఆఫీస్, బిజినెస్ పనులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ నుంచి వచ్చే మెసేజ్ లు చదుకొని, వారితో చాట్ చేస్తూ చాలాా ఆనందంగా గడిపేవాళ్లం. ఇప్పుడు ఎవరికీ స్నేహితులతో చాట్ చేయడానికి ఖాళీ లేదు. కనీసం కాసేపు సరదాగా ఫోన్ మాట్లాడటానికి కూడా ఫ్రీ టైం దొరకడం లేదు. 

వాట్సాప్‌లో త్వరలో AI ఫ్రెండ్

వాట్సాప్ వినియోగదారుల్లో ఈ లోటును తీర్చేందుకు వాట్సాప్ కొత్త AI ఫ్రెండ్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన AI పవర్డ్ చాట్‌బాట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పర్సనలైజ్డ్ AI చాట్‌బాట్‌తో మనిషితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడొచ్చు. AI పవర్డ్ చాట్‌బాట్‌ వ్యక్తిత్వం, రూపాన్ని కూడా యూజర్లే క్రియేట్ చేయవచ్చు. అంటే మీకు నచ్చినట్టుగా AI చాట్‌బాట్‌ మాట్లాడుతుంది. బిహేవ్ చేస్తుందన్న మాట.

ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ప్రివ్యూ!

వాట్సాప్ ప్రస్తుతం Google Play Storeలో 2.25.18.4 అప్‌డేట్‌ను ఉపయోగించి, కస్టమ్ AI చాట్‌బాట్ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ప్రారంభంలో "Create an AI" యాప్ ప్రారంభ వెర్షన్లలో మొదట కనిపించిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

వాట్సాప్ ‘Create AI’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్ లో "Create an AI" ఫీచర్ ద్వారా యూజర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా AI ఫ్రెండ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లకు AI అసిస్టెంట్‌లను డిజైన్ చేసే మార్గాలను అందిస్తుంది. యూజర్లు తమ చాట్‌బాట్‌ను ప్రొడక్టివిటీ అసిస్టెంట్‌గా, డిజిటల్ కోచ్‌గా లేదా టైమ్ పాస్ చేసుకోవడానికి కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే యూజర్లు చాట్ బాట్ రూపాన్ని, వ్యక్తిత్వ లక్షణాలను, వాయిస్ టోన్ ను కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు.

మీకు నచ్చినట్టుగా AIని క్రియేట్ చేయవచ్చు

బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే పబ్లిక్ వెర్షన్ విడుదలయ్యే వరకు అందరు యూజర్లు వెయిట్ చేయక తప్పదు. 

"Create AI"ని ఎంచుకున్న తర్వాత, యూజర్లు తమ AI చాట్ బాట్ క్రియేట్ చేయడానికి 1,000 లెటర్స్ మించకుండా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా AI చాట్ బాట్ క్రియేట్ అవుతుంది. 

AI మెంటల్ హెల్త్ కోచ్, టీచర్, గైడ్, అసిస్టెంట్‌ ఇలా ఏదైనా మీరు తయారు చేసుకోవచ్చు. యూజర్లు మీకు నచ్చిన స్వరాన్ని AI చాట్ బాట్ కు ఎంచుకోవచ్చు. అంతేకాకుండా AI సూచనలను అనుసరించి సొంత అవతార్‌ను కూడా సృష్టించవచ్చు. 

AI చాట్ బాట్ ను షేర్ కూడా చేయొచ్చు

మీరు క్రియేట్ చేసుకున్న AI చాట్‌బాట్‌ను కావాలంటే సోషల్ మీడియాలో లేదా ఫ్రెండ్స్, గ్రూప్‌లతో షేర్ చేయవచ్చు. లేదనుకుంటే మీ సొంత అవసరాల కోసం ప్రైవేట్‌గానూ ఉంచుకోవచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Credit Card: అప్పుల పడకుండా ఉండాలంటే.. క్రెడిట్​ కార్డులను ఇలా వాడండి..
Amazon Freedom Sale 2025: అమెజాన్ బంపర్ ఆఫర్స్.. రూ. 30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్!