ఇండియాలోనే మొట్టమొదటిసారి.. విమానంలో ప్రయాణించే వారికి ఫ్రీ వై-ఫై..

Ashok Kumar   | Asianet News
Published : Sep 18, 2020, 05:27 PM IST
ఇండియాలోనే మొట్టమొదటిసారి.. విమానంలో ప్రయాణించే వారికి ఫ్రీ వై-ఫై..

సారాంశం

ప్రస్తుతం ఢీల్లీ నుంచి లండన్ కు  నడుపుతున్న విమానాలలో  వై-ఫై సేవలను అందిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఒక పత్రికా ప్రకటనలో ఎయిర్ లైన్స్"ప్రారంభ ఆఫర్‌ కింద వై-ఫై సర్వీస్ విస్టారా కస్టమర్లందరికీ పరిమిత కాలానికి ఉచితంగా లభిస్తుంది.

న్యూ ఢీల్లీ: ఇండియన్ ఎయిర్ లైన్ ప్రైవేట్ క్యారియర్ చెందిన విస్టారా ఎయిర్ లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో వై-ఫై సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఢీల్లీ నుంచి లండన్ కు  నడుపుతున్న విమానాలలో  వై-ఫై సేవలను అందిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది.

ఒక పత్రికా ప్రకటనలో ఎయిర్ లైన్స్"ప్రారంభ ఆఫర్‌ కింద వై-ఫై సర్వీస్ విస్టారా కస్టమర్లందరికీ పరిమిత కాలానికి ఉచితంగా లభిస్తుంది." అని చెప్పింది. విమానంలో వైఫై సేవలను అందించే మొట్టమొదటి భారతీయ విమానయాన సంస్థ విస్టారా అని తెలిపింది.

రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి వైఫై సేవలను దాని ఎయిర్‌బస్ ఎ 321 నియో విమానంలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు విస్టారా లైన్స్ తెలిపింది. విస్టారా విమానయాన సంస్థలో రెండు డ్రీమ్‌లైనర్ విమానాలను కలిగి ఉంది.

also read ట్రేయిన్ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. త్వరలో యూసర్ చార్జ్ వసూల్ చేయనున్న రైల్వే.. ...

ఈ రెండూ ప్రస్తుతం ఢీల్లీ-లండన్ మధ్య విమానాలను నడపడానికి ఉపయోగిస్తున్నయి. ఇండియా - యుకె మధ్య ద్వైపాక్షిక ఎయిర్ బాబుల్ ఒప్పందం ప్రకారం ఫుల్ -సర్వీస్ రాకపోకలు ఆగస్టు 28 నుండి ఢీల్లీ-లండన్ మార్గంలో విమానాలను ప్రారంభించింది.

"ఉచిత  వై-ఫై లిమిటెడ్ ఆఫర్ లో భాగంగా విస్టారా వై-ఫై సిస్టమ్ కార్యాచరణపై  ఫీడ్ బ్యాక్ సేకరిస్తుంది. వై-ఫై సేవను మరింత చక్కగా తీర్చిదిద్దడానికి మొత్తం కస్టమర్ అనుభవంపై అభిప్రాయాన్ని సేకరిస్తుంది" అని తెలిపింది.

వైఫై సేవలకు సంబంధించిన సుంకాల ప్రణాళికలను నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి భారతదేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఏదేమైనా మే నుండి వందే భారత్ మిషన్ క్రింద జూలై నుండి భారతదేశం ఇతర దేశాల మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం క్రింద ప్రత్యేక అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు దేశంలో నడుస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్