మొదటిసారి తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్ లో నిలిచాడు.ఇండియాలో ఉన్న బాలీవుడ్ నటులను సైతం వెనక్కి నెట్టి టాప్ స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఈ ఏడాది సెలబ్రిటీల లిస్టును ఫోర్బ్స్ ఇండియా గురువారం విడుదల చేసింది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలలో తరువాత మొదటిసారి తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్ లో నిలిచాడు.ఇండియాలో ఉన్న బాలీవుడ్ నటులను సైతం వెనక్కి నెట్టి టాప్ స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఈ ఏడాది సెలబ్రిటీల లిస్టును ఫోర్బ్స్ ఇండియా గురువారం విడుదల చేసింది.
విరాట్ కోహ్లీ తన 31 ఏళ్ల వయస్సులో అక్టోబర్ 1, 2018 నుంచి సెప్టెంబర్ 30, 2019 మధ్య సంపాదించిన మొత్తం 252.72 కోట్లు . ఈ సంపాదన మొత్తం మ్యాచ్ ఫీజు, బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఇంకా స్పాన్సర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సంపాదించినవి.
undefined
also read ఐసీయూలో ఇండియన్ ఎకానమీ...తేల్చేసిన సుబ్రమణ్యం
కిందటి ఏడాది మొదటి స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ స్థానాన్ని విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ తొలిసారిగా సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటుడిని కూడా వెనక్కి నెట్టి ఈ ఏడాది ఫోర్బ్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.నటుడు యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ( 293.25 కోట్లు) 2 వ స్థానంలో ఉండగ, 2016 నుండి అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ ని 3 వ స్థానానికి పడిపోయాడు.
దీపికా పదుకొనే, అలియా భట్ టాప్ 10 లో భాగం కావడం కూడా ఇదే మొదటిసారి. అంతేకాకుండా, జాబితాలో దాదాపు మూడోవంతు మహిళలు, లాభదాయకమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదనతో మరియు ఎక్కువ ఫేమ్ పొందిన నటులు దిషా పటాని, కృతి సనోన్ మరియు సారా అలీ ఖాన్ ఈ జాబితాలో అడుగుపెట్టారు.
also read ముకేశ్ అంబానీ...కేవలం ఐదేళ్లలో ఎంత సంపాదించాడో తెలుసా...
మొత్తంమీద ఈ సంవత్సరంలో ఉన్న 100 మంది ప్రముఖులు గత సంవత్సరంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ సంపాదించారు. వారి ఆదాయం 2018 లో 3,140.25 కోట్ల నుండి 3,842.94 కు పెరిగింది. 2018 లో కేవలం ఒక సినిమా విడుదల ద్వారా షారుఖ్ ఖాన్ తిరిగి టాప్ 10లో ఉన్నాడు. గత సంవత్సరంతో పోలిస్తే 27 శాతం తక్కువ సంపాదించడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయినప్పటికీ ప్రతి సంవత్సరం టాప్ 10 లో చోటు దక్కించుకునే ప్రత్యేకతను పొందాడు. సచిన టెండూల్కర్ పేరులో ఉన్న ఆ బ్రాండ్ నిజంగా చెక్కుచెదరకుండా అలానే ఉంది. సచిన్ టెండుల్కర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.ఎంఎస్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు.