మార్కెట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ IPO. ఆరంభంలోనే రూ.1 లక్షకు...41 వేల లాభం

By Krishna Adithya  |  First Published Jun 22, 2023, 3:19 PM IST

Urban Enviro Waste Management IPO: చాలా కాలం తర్వాత ఐపీఓ మార్కెట్ లో సందడి నెలకొంది తాజాగా మార్కెట్లో లిస్ట్ అయినటువంటి అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ షేర్లు అద్భుతమైన అరంగేట్రం చేశాయి. ఏకంగా 41% ప్రీమియంతో మదుపరుల జేబులు నింపాయి.


Urban Enviro Waste Management IPO: అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.  ఈ కంపెనీ షేర్లు నేటి లిస్టింగ్ లో ఇష్యూ ధర కంటే 41 శాతం అధిక  ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఒక్కో షేరు రూ.141 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది, ప్రారంభ ఆఫర్ ధర రూ. 100ను అధిగమించింది. అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్  IPO మార్కెట్ లో  అద్భుతమైన స్పందన  లభించింది.  ఎందుకంటే ఇది 255.49 రెట్లు భారీ  సబ్ స్క్రిప్షన్ పొందింది. కొనుగోలుకు అందుబాటులో ఉన్న 11.42 లక్షల షేర్లను అధిగమించి 27.72 కోట్ల షేర్లకు బిడ్లు అందాయి.

జూన్ 12 నుండి 14 వరకు సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో, పబ్లిక్ ఇష్యూకి అసాధారణమైన డిమాండ్ వచ్చింది, రిటైల్ విభాగంలో 220.65 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఇతర వర్గం 281.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.

Latest Videos

రూ. 11.42 కోట్ల విలువైన అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ IPO 11.42 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ. 100 ధరకు విక్రయించింది.  కంపెనీలో  వాటాదారు వికాస్ శర్మ తన 2.22 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) క్రింద విక్రయించాడు. మొత్తం 9.2 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ సైజు రూ. 9.2 కోట్లుగా అంచనా వేశారు. 

అర్బన్ ఎన్విరో వేస్ట్ IPO మార్కెట్ ఒక్కో లాట్ లో 1,200 ఈక్విటీ షేర్లను కొనాలని ఆఫర్ చేసింది. అంటే రిటైల్ పెట్టుబడిదారులు ఒక లాట్‌ను కొనుగోలు చేయడానికి కనీసం రూ. 120,000 పెట్టుబడి పెట్టాలి. NSE ఎమర్జ్ ప్లాట్‌ఫారమ్‌లో అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ షేర్ల జాబితా జూన్ 22న షెడ్యూల్ చేశారు. పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ IPO రిజిస్ట్రార్‌గా నియమించబడింది.

అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వేస్ట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ , మున్సిపల్ సాలిడ్ వేస్ట్ (MSW) మేనేజ్‌మెంట్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇందులో వ్యర్థాల సేకరణ, రవాణా, విభజన ,  పారవేయడం వంటి పనులు ఉంటాయి.

click me!