కార్వీ స్టాక్ బ్రోకింగ్ లైసెన్స్ నిలిపివేతపై సెక్యూరిటీస్ అపీలేట్ ట్రైబ్యునల్ స్పందించింది. డిసెంబర్ 6లోగా ఈ విషయంపై ఎన్ఎస్ఈ ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మరోవైపు 'కార్వీ' షేర్లను ఖాతాదారులకు బదిలీ చేయాలన్న ఎన్‌ఎస్డీఎల్ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంకులకు, బజాజ్‌ఫైనాన్స్ సంస్థకు ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది.ఇక ట్రేడింగ్ పై నిషేధం విషయమై శుక్రవారం కల్లా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎస్ఈని శాట్ ఆదేశించింది.
ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రుణదాతలకు తనఖా షేర్ల విషయమై తక్షణ ఊరట కల్పించేందుకు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) నిరాకరించింది. ఈ నెల 6వ తేదీకల్లా సెబీనే సంప్రదించాలని సూచించింది. రుణాలు పొందేందుకు కార్వీ తన ఖాతాదారుల షేర్లను తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే.
మొత్తం 95వేల మంది ఖాతాదారులకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండానే తాకట్టు పెట్టిన కార్వీ రూ.600 కోట్ల రుణం తీసుకుంది. బ్యాంకర్ల వాదనలు విని ఈ నెల 12వ తేదీ లోగా తుది నిర్ణయం వెల్లడించాలని సెబీని శాట్ ఆదేశించింది. బజాజ్ ఫైనాన్స్ విషయంలోనూ ఈ నెల 10వ తేదీ లోగా తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
also read నీరవ్ మోదీ కొల్లగొట్టింది 13 వేల కోట్లు కాదు....ఏంతంటే?
కార్వీ ఆధీనంలో ఉన్న ఖాతాదారుల షేర్లను తిరిగి వారి అకౌంట్లలోకి బదిలీ చేయాలన్న సెబీ ఆదేశాలను ఎన్‌ఎస్డీఎల్ సోమవారం అమలు చేసింది. దాదాపు 90 శాతం మంది (83,000 మంది) ఖాతాదారులకు షేర్లను ఎన్‌ఎస్డీఎల్ తిరిగి బదిలీ చేసింది.
అయితే, సెబీ నిర్ణయాన్ని తొలుత సోమవారం బజాజ్ ఫైనాన్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. దీన్ని విచారించిన శాట్ .. మరిన్ని బదిలీలు జరుగకుండా స్టే విధించింది. మంగళవారం హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండ్‌సఇండ్ బ్యాంక్ ఇంకా ఇతర ఆర్థిక సంస్థలు కూడా జత కలిశాయి. వారి వాదనలు విన్న శాట్ బెంచ్.. మిగతా 10 శాతం షేర్ల బదిలీని మాత్రం నిలిపివేసింది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్.. ట్రేడింగ్ లైసెన్స్ నిలుపుదల విషయంలో ఎన్ఎస్ఈ శుక్రవారం నాటికి ఓ నిర్ణయం తీసుకోవాలని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ) సూచించింది. ఎన్ఎస్ఈ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిన కార్వే స్టాక్ బ్రోకింగ్ లైసెన్స్‌ను నిలిపివేస్తున్నట్లు సోమవారం జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. దీనిని సవాల్ చేస్తూ శాట్‌లో కార్వీ సవాల్ చేసింది.
also read మీ చుట్టు రోజూ తిరుగలేం...జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
"ఎన్ఎస్ఈ విధించిన సస్పెన్షన్‌పై కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. దీనిపై సంబంధిత సంస్థ (ఎన్ఎస్ఈ) ఈ డిసెంబర్ 6లోగా ఓ నిర్ణయం తీసుకోవాలి" అని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రైబ్యునల్ పేర్కొంది. లైసెన్స్ నిలిపివేతతో క్యాపిటల్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ డెరివేటివ్స్, డెట్ అండ్ కమొడిటీ డెరివేటివ్స్ విభాగాల్లో ట్రేడింగ్ చేసే అవకాశాన్ని కార్వీ స్టాక్ బ్రోకింగ్ ల్పోయింది.
95వేల మంది ఖాతాదారులకు చెందిన షేర్లను తనఖా పెట్టి దుర్వినియోగం చేసినట్లు అభియోగాన్ని కార్వీ ఎదుర్కొంటున్నది. ఇదే విషయాన్ని ఎన్ఎస్ఈ నవంబర్ 22న సెబీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.అదే రోజున కార్వీ స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల్లో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది సెబీ. ఖాతాదారులకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని వినియోగించకుండా నిలిపివేసింది