ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...10వేల వరకు పెంపు....

By Sandra Ashok KumarFirst Published Mar 13, 2020, 4:06 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు  డియర్ నెస్ అలవెన్స్ (డి‌ఏ)  4% పెంచడానికి కేంద్ర క్యాబినెట్ శుక్రవారం (మార్చి 13, 2020) ఆమోదం తెలిపింది.

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు  డియర్‌నెస్ అలవెన్స్ (డి‌ఏ)  4% పెంచడానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం (మార్చి 13, 2020) ఆమోదం తెలిపింది.  ద్రవ్యోల్బణం, నిత్యవసరమైన వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపు ఆధారపడి ఉంటుంది.  

also read లాభాల్లో స్టాక్ మార్కెట్లు...భారీగా సెన్సెక్స్ రికవరీ...

4 శాతం పెంపు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతం నెలకు రూ .720 పెరిగి రూ .10,000 కు పెరుగుతుంది. కాగా, 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూల వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2020 నుండి అమల్లోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ),  డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పింది. సాధారణంగా డిఎ/ డిఆర్ ఈ నెలలో చెల్లించబడుతుంది.

also read యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

ప్రతి సంవత్సరం 1 జనవరి, 1 జూలైన  అమల్లోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్,  డియర్‌నెస్ రిలీఫ్ మంజూరు చేయబడతాయి. సాధారణంగా మార్చి, సెప్టెంబర్ నెలలలో వాటిని చెల్లిస్తారు. అక్టోబర్ 2019 లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఎను జూలై 1 2019 నుంచి అమల్లోకి వచ్చే బేసిక్ వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచింది.

click me!