క్రిప్టోక‌రెన్సీల‌పై సుప్రీం కోర్ట్ సంచ‌ల‌న తీర్పు...

By Sandra Ashok Kumar  |  First Published Mar 4, 2020, 3:05 PM IST

ఏప్రిల్ 2018లో, బిట్ కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీల వాడకాన్ని నిషేదిస్తూ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను కఠినతరం చేసింది.
 


క్రిప్టోకరెన్సీతో లావాదేవీలు చేయ‌రాదు అని భార‌తీయ బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేస్తూబుధవారం అనుమతి ఇచ్చింది. బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలలో వర్తకం చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గతంలో విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.

క్రిప్టోకరెన్సీ కరెన్సీ ఎక్స్ఛేంజీలు, వ్యాపారులకు బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయకుండా రుణదాతలను ఆర్‌బిఐ నిషేధించినందున ఈ రంగం అభివృద్ధికి పెద్ద ఉపశమనం కలిగించింది.

Latest Videos

undefined

also read భారత్‌లోని కీలక రంగాలకు కరోనా వైరస్‌ ముప్పు...

అంతకుముందు వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ లేదా క్రిప్టోక‌రెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్ లావాదేవీల‌ను నిలిపివేయాలంటూ 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

ఆర్‌బిఐ నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఐఐ) చేసిన విజ్ఞప్తిని అనుసరించి ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు జారీ చేసింది.

also read  ఆధార్ లింక్‌కు లాస్ట్ చాన్స్.. ఆ తర్వాత..రూ.10 వేలు ఫైన్!

రోహిట‌న్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌, సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ స‌ర్క్యూల‌ర్‌ను కొట్టి వేస్తూ తీర్పును ఇచ్చింది.  ట్రేడింగ్‌లో క్రిప్టోల‌ను ఆర్బీఐ నిషేధించ‌డాన్ని కోర్టు త‌ప్పుప‌ట్టింది. వాస్త‌వానికి క్రిప్టో ట్రేడింగ్‌ను ఆర్బీఐ ఆప‌లేదు. కేవ‌లం బ్యాంకుల‌కు మాత్రం గ‌తంలో ఆర్బీఐ త‌న ఆదేశాల‌ను జారీ చేసింది.
 

click me!