రైళ్లలో వినోదానికి టీవీలు కావాలని... ప్యాసింజర్ల డిమాండ్లు !!

By Sandra Ashok Kumar  |  First Published Jan 24, 2020, 11:03 AM IST

ప్రైవేట్ రైళ్లు ‘తేజాస్’ మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. చార్జీలు పెంచినా మెరుగైన వసతులు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు రైళ్లలో వినోదానికి టీవీ ప్రసారాలు అందుబాటులోకి తేవాలన్న వినతులు అందుతున్నాయి. 


న్యూఢిల్లీ: నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో మలి విడత కొలువు దీరిన ఎన్డీఏ సర్కార్ వచ్చేనెల ఒకటో తేదీన తొలి విడత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇటీవల రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో తరుచుగా రైలులో ప్రయాణించే ప్రయాణికులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశల పల్లకిలో ఉన్న ప్రధానాంశాలు ఒక్కసారి పరిశీలిద్దాం..

* రైలు సర్వీసుల నిర్వహణలో సమయ పాలన పాటించాలని అత్యధికులైన ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. 

Latest Videos

undefined

also read ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి వార్నింగ్...జాగ్రతగా ఉండండి లేదంటే...?

* రైళ్లలో ప్రయాణించే వారు క్యాంటిన్ నుంచి సరఫరా చేసే ఆహారం, పానీయాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినా మరింత  మెరుగైన సేవలందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

* స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లతో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ ప్రసారాలు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. 

* రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రతకు పెద్దపీట వేస్తూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు వెల్లువెతుతున్నాయి. 

also read ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

* ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో స్వచ్ఛత అమలవుతున్న తీరుపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. 

* రోడ్డు రవాణా కంటే మెరుగైన, చౌకైన ప్రయాణం రైలు ప్రయాణం. అయితే చార్జీలను ప్రస్తుతం ప్రయాణికులు పట్టించుకోవడం లేదు. కానీ మెరుగైన వసతులు కల్పించాలన్న సంగతిని విస్మరించొద్దని రైల్వే శాఖకు, రైల్వే బోర్డుకు సూచిస్తున్నారు.  

* తేజాస్ వంటి ప్రైవేట్ రైళ్ల సంఖ్య మరింత పెంచాలన్న అభ్యర్థనలు వ్యక్తం చేస్తున్నారు.  

* ఈ దఫా బడ్జెట్లో రైల్వేశాఖ తమకు మెరుగైన, నూతన గిఫ్ట్‌లు అందిస్తారని ప్రయాణికులు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.  

click me!