ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

Ashok Kumar   | Asianet News
Published : Jan 23, 2020, 01:22 PM ISTUpdated : Jan 23, 2020, 09:35 PM IST
ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

సారాంశం

బ్యాంక్ ఆఫ్ బరోడాకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభుత్వం సంజీవ్ చాధాను నియమించింది. సంజీవ్ చాధా ప్రస్తుతం ఎస్‌బి‌ఐ క్యాపిటల్ మార్కెట్స్  ఎండి, సిఇఓగా పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) వ్యాపార, బ్యాంకింగ్ పెట్టుబడి విభాగనికి ఎండి, సిఇఓ ఉన్నరు.

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్  మూడు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎం.డి, సి.ఇ.ఓ పదవులలో మార్పులు చేసింది. ఈ పదవులకు కొత్తగా కొందరిని పదోన్నతులు కల్పిస్తూ  ప్రభుత్వం సోమవారం మూడు సంవత్సరాల కాలానికి వారిని నియమించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (బోబ్)కు సంజీవ్ చాధా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)గా ప్రభుత్వం నియమించింది. ఇంతకు ముందు పి.ఎస్. జయకుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా  మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలను నివహించారు. గత ఏడాది అక్టోబర్ లో అతని పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త  మేనేజింగ్ డైరెక్టర్ నియమకాలు జరిగాయి. 

also read Budget 2020: మధ్యతరగతి వారికి బిగ్ బోనంజా? రూ. 5 లక్షలదాకా నో ట్యాక్స్!

సంజీవ్ చాధా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అతనికి మూడేళ్ల పాటు కాలపరిమితి ఉంటుందని భారత ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది.సంజీవ్ చాధా ప్రస్తుతం ఎస్‌బి‌ఐ క్యాపిటల్ మార్కెట్స్  ఎండి, సిఇఓగా పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) వ్యాపార, బ్యాంకింగ్ పెట్టుబడి విభాగనికి ఎండి, సిఇఓ ఉన్నరు.

2019 నవంబర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి, సీఈఓ పోస్టులకు బ్యాంకుల బోర్డు బ్యూరో సంజీవ్ చాధా పేరును సిఫారసు చేసింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా (బోఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి, సీఈఓ పదవికి అతను ఎదిగారు.అతను నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడేళ్లపాటు బ్యాంకుకు నాయకత్వం వహిస్తాడు.

also read Budget 2020: విద్యా, ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపు.....

దినబంధు మోహపాత్రా  గతేడాది జూన్లో  తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ పదవి ఖాళీగా ఉంది.ఎల్.వి. ప్రభాకర్ బెంగళూరుకు చెందిన కెనరా బ్యాంక్‌ కొత్త ఎండి, సిఇఒగా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.1 మార్చి 2018 నుండి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా  ఎల్.వి. ప్రభాకర్ పనిచేస్తున్నారు. అతనికి ముందు ఆర్. ఎ.శంకర నారాయణన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఎస్‌బి‌ఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా  పనిచేసిన చల్లా శ్రీనివాసుల సెట్టీని మూడేళ్ల కాలం పాటు బ్యాంక్ ఎం.డి పదవికి ప్రభుత్వం నియమించింది.అతని పదవీకాలాన్ని మరో రెండేళ్ల వరకు పొడిగించనుంది. శ్రీనివాసుల సెట్టి నియామకం కోసం ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు
Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?