ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి వార్నింగ్...జాగ్రతగా ఉండండి లేదంటే...?

By Sandra Ashok KumarFirst Published Jan 23, 2020, 5:37 PM IST
Highlights

ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీలు దేశం మొత్తంలో ఎక్కడికైనా వెళ్లడానికి ప్యాకేజీలు ఉంటాయి. ప్రయాణికులు ముంబై నుండి అండమాన్, వైష్ణో దేవి నుండి తిరుపతి వరకు ప్రయాణించవచ్చు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళటానికి ఐఆర్‌సిటిసి ప్రయాణికులకు వివిధ టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. ప్రయాణీకులు వారి ప్రణాళికల ప్రకారం ప్యాకేజీని చూసి ఎంచుకోవచ్చు. ప్యాకేజీ ధరల విషయంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు ప్యాకేజీలను పొందవచ్చు.

ఈ సర్వీస్ లో భాగంగా మీరు వారం రోజులు లేదా రెండు రోజుల ప్రయాణాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీలు దేశం మొత్తంలో ఎక్కడికైనా వెళ్లడానికి ప్యాకేజీలు ఉంటాయి. ప్రయాణికులు ముంబై నుండి అండమాన్, వైష్ణో దేవి నుండి తిరుపతి వరకు ప్రయాణించవచ్చు.

also read ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

ఈ ప్యాకేజీల సహాయంతో మీరు మతపరమైన ప్రాముఖ్యత గల వివిధ పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. ఐ‌ఆర్‌సి‌టి‌సి టూర్ ప్యాకేజీలు ప్రయాణీకులకు సహాయం చేయడమే కాకుండా ఇది స్థానిక టూర్ ఏజెన్సీలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు.

చాలా మంది ప్రజలు ఐఆర్‌సిటిసి ద్వారా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకుంటుంటారు. ఇది అవకాశంగా చేసుకొని మోసగాళ్ళు ఐఆర్‌సిటిసి పేరిట టూర్ ప్యాకేజీలను అందించే మోసపూరిత వెబ్‌సైట్‌ తయారు చేసి ప్రజలకు వివిధ ఆఫర్లను ఇస్తున్నారు.ఈ నకిలీ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవాలనుకునే వారిని మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదించడం.

ఈ మోసంపై ఐఆర్‌సిటిసి వినియోగదారులకు వార్నింగ్ మెయిల్ పంపడం ద్వారా హెచ్చరించింది.Www.irctctour.com అనే వెబ్‌సైట్ ఐఆర్‌సిటిసి పేరిట ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు టికెట్ బుక్ చేసుకునే విధంగా ఆఫర్లను చూపిస్తూ మోసపూరిత లావాదేవీలు చేస్తోందని ఐఆర్‌సిటిసి వినియోగదారులను హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్‌పై ఐఆర్‌సిటిసి ఫిర్యాదు కూడా చేసింది.

నకిలీ వెబ్‌సైట్  చూడటానికి  ఐఆర్‌సిటిసి నిజమైన వెబ్‌సైట్ లాగానే ఉంటుంది. కంపెనీ తరపున ప్యాకేజీలను అందించే ఐఆర్‌సిటిసిలో భాగమని వెబ్‌సైట్ పేర్కొంది. ఐఆర్‌సిటిసి దీనిపై వినియోగదారులకు హెచ్చరిక మెయిల్ పంపింది వారిని అప్రమత్తం చేసింది అలాగే ఐ‌ఆర్‌సి‌టి‌సి అధికారిక పోర్టల్‌లో ఒక మెసేజ్ కూడా పెట్టారు.

also read Budget 2020: విద్యా, ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపు.....

ఐఆర్‌సిటిసి - ఐఆర్‌సిటిసి పేరిట మోసపురితామైన బుకింగ్ వల్ల నష్టపోయిన వారి నుంచి ఐటి సెంటర్‌కు ఇటీవల రెండు ఫిర్యాదులు కూడా వచ్చాయి. టూర్ కన్ఫర్మేషన్ వోచర్ కూడా ఐఆర్‌సిటిసికి  లాగే ఒకేలా ఉంది. దాంట్లో పేర్కొన్న వివరాలు మొబైల్ నెం .9999999999, ల్యాండ్‌లైన్ నెం. +91 6371526046 & ఇమెయిల్-ఐడి: irctctours2020@gmail.com ఉపయోగించి ఐఆర్‌సిటిసి పేరిట  వోచర్లను విక్రయించడానికి ఉపయోగిస్తున్నారు.

ఈ కార్యాలయం ఇప్పటికే  కౌంటర్ నుండి ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసింది. పర్యాటక హోమ్‌పేజీలో వార్నింగ్ స్క్రోలర్ కూడా పెట్టింది.కొన్ని నెలల క్రితం ఐఆర్‌సిటిసి తన ఖాతాదారులకు వారి ఖాతా నంబర్లు, ఎటిఎం కార్డ్, పిన్, యుపిఐ వివరాలకు సంబంధించిన ఎలాంటి వివరాలను ఫోన్ ద్వారా లేదా ఇ-మెయిల్స్ ద్వారా ఎవరితో పంచుకోవద్దు అని హెచ్చరించింది. రద్దు చేసిన టిక్కెట్లపై డబ్బు తిరిగి పొందటానికి కోసం వ్యక్తిగత సమాచారం కోరుతూ ఐఆర్‌సిటిసి ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు, ఇమెయిల్‌లు లేదా మెసేజ్ లను వినియోగదారులకు పంపదు అని మరోసారో వివరించింది.
 

click me!