కేంద్ర బడ్జెట్... నిర్మలాసీతారామన్ టీం ఇదే..

By telugu teamFirst Published Jul 5, 2019, 11:18 AM IST
Highlights

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారి నేడు నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడంతో... దీనిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారి నేడు నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడంతో... దీనిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ నిర్మలా సీతారామన్ తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టడంతో ఆమె ఎలాంటి బడ్జెట్ అందిస్తున్నారోననే ఆసక్తి అందరిలో ఉంది. అయితే... ఆమె ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో ఆమెకు కొందరు అధికారులు సహాయం చేశారు. ఆమె వెనుక ఒక టీం ఉంది. ఆ టీంలోని మెంబర్స్ సహాయంతో ఈ బడ్జెట్ ని తీసుకువచ్చారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1.కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్.. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్
2.సుభాష్ చంద్ర గార్గ్..ఫైనాన్స్‌, ఆర్థిక కార్యదర్శి
3. అజయ్ భూషన్ పాండే... రెవిన్యూ సెక్రటరీ
4.జీసీ ముర్ము ...ఎక్సెపెండీచర్‌ సెక్రటరీ
5. రాజీవ్ కుమార్...ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ
6.అతాను చక్రబర్తి...డీఐపీఏఎం సెక్రటరీ

ఈ ఆరుగురు అధికారుల సహకారంతోనే నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బడ్జెట్ లో పన్ను తగ్గింపు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి వాటి గురించి ఏం చెప్పదలుచుకున్నారనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. 

click me!