నేడే బడ్జెట్... అందరిచూపు తెలుగింటి కోడలిపైనే

By telugu teamFirst Published Jul 5, 2019, 10:00 AM IST
Highlights

నరేంద్రమోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చింది. కాగా... రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

నరేంద్రమోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చింది. కాగా... రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా... ఈ బడ్జెట్ ని తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా... దేశవ్యాప్తంగా అందరి చూపు ఆమెపైనే ఉన్నాయి.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఓ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఇవాళ 11 గంటలకు ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా ఇప్పుడు అందరి చూపూ నిర్మల బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుందా లేదా అన్నదానిపైనే ఉంది. వాస్తవ దృష్టితో సంస్కరణల బడ్జెట్‌గా ఉంటుందా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
 
మరోవైపు భూ, కార్మిక చట్టాలు సహా ఎప్పటి నుంచో ఉగ్గబట్టుకుని చూస్తున్న పెట్టుబడి దారులకు ఈ బడ్జెట్ మార్గనిర్దేశనం చేస్తుందని కూడా ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. భూ సేకరణ, కార్మికుల లభ్యతలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా పారిశ్రామిక పురోగతికి ప్రతిబంధకంగా మారిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆర్ధికాభివృద్ధి కోసం మళ్లీ ప్రయివేటు పెట్టుబడులకు కేంద్రం ద్వారాలు తెరుస్తుందా.. లేక ఇప్పటికి ఆ అంశాన్ని వదిలి వేస్తుందా అన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఇవాళ పార్లమెంటు ముందుకు బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

click me!