బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయాన్ని మార్చేసిన నిర్మలా సీతారామన్

Published : Jul 05, 2019, 10:11 AM ISTUpdated : Jul 05, 2019, 11:22 AM IST
బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయాన్ని మార్చేసిన నిర్మలా సీతారామన్

సారాంశం

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ మరికాసేపట్లో వెల్లడికానుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ మరికాసేపట్లో వెల్లడికానుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ నిర్మలా సీతారామన్ తొలిసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గా బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో.. అందరి దృష్టి దీనిపైనే ఉంది.

బడ్జెట్ వెల్లడించానికి ముందే... ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఓ సంప్రదాయాన్ని నిర్మలా సీతారామన్ మార్చేసారు. సాధారణంగా బడ్జెట్ ని లెదర్ బ్యాగ్ లో తీసుకువస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు తమకు నచ్చిన రంగు లెదర్ బ్యాగు లో బడ్జెట్ ప్రతులను తీసుకువస్తారు. అయితే... ఆమె ఈ సంప్రదాయాన్ని మార్చేశారు.

ఆర్థికశాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్‌ చేతిలో బ్రీఫ్ కేసు కాకుండా ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్‌ లాంటిది కన్పించింది. దానిపై రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎలాంటి బ్యాగ్ లేకుండా.. ఓ ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బడ్జెట్ ని తీసుకురావడం విశేషం. 

 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు