యూనిలీవర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆ సంస్థలో పని చేసే 7,500 మంది ఉద్యోగుల పై ప్రభావం చూపనుంది. వచ్చే మూడేళ్లలో ఆ కంపెనీ 869 మిలియన్ డాలర్లు ఆదా చేసే ప్రక్రియను ప్రారంభించింది.
మాగ్నమ్, బెన్ అండ్ జెర్రీస్ వంటి పాపులర్ బ్రాండ్లకు నిలయమైన యూనిలీవర్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఐస్ క్రీమ్ యూనిట్ ను స్టాండలోన్ బిజినెస్ లోకి మార్చాలని యోచిస్తోంది. దీని వల్ల 7,500 ఉద్యోగాలను ప్రభావం చూపే అవకాశం ఉంది. స్పిన్ ఆఫ్ వెంటనే ప్రారంభమవుతుందని, 2025 చివరి నాటికి పూర్తవుతుందని లండన్ లిస్టెడ్ కంపెనీ తెలిపింది.
పతంజలి ప్రకటనల కేసు.. విచారణకు రావాలని రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు ఆదేశం
విభజన తర్వాత మిడ్ సింగిల్ డిజిట్ అమ్మకాల వృద్ధి, స్వల్ప మార్జిన్ మెరుగుదలను అందించి సరళమైన, మరింత ఫోకస్డ్ కంపెనీగా ఎదగాలని యూనిలీవర్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే మూడేళ్లలో మొత్తం 800 మిలియన్ యూరోలు (869 మిలియన్ డాలర్లు) మొత్తం వ్యయ ఆదాను అందించే కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించింది ప్రతిపాదిత మార్పులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,500 ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి. మొత్తం పునర్నిర్మాణ ఖర్చులు ఈ కాలంలో దాని టర్నోవర్ లో 1.2 శాతం ఉంటాయని అంచనా