హైదరాబాద్ యువకుల అరుదైన ఘనత.. ఫోర్బ్స్‌ అండర్ 30 ఆసియా జాబితాలో ఇద్దరికీ చోటు..

By S Ashok KumarFirst Published Apr 22, 2021, 6:41 PM IST
Highlights

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రణవ్ వెంపతి, సమర్థ్‌ సింధీ ఫోర్బ్స్ అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నారు.
 

 హైదరాబాద్: ఫోర్బ్స్ అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన  మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  ప్రణవ్ వెంపతి, డీజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్‌ సింధీ చోటు దక్కించుకున్నారు.

మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ సంస్థ  కృత్రిమ అవయవాలను తయారు చేస్తుంది. ఈ  సంస్థ ‘కల్‌ఆర్మ్‌’ అనే పేరుతో బయోనిక్‌ హ్యాండ్‌ తయారు చేసి, చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్‌ సహా అన్ని రకాల పనులు చేయవచ్చు. 

" ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా  బయోనిక్‌ హ్యాండ్‌ కొన్ని భాగాల కొరతను ఎదుర్కొంటోంది. రెండు నెలల్లో పరిస్థితి తేలికవుతుందని మేము ఆశిస్తున్నాము, తరువాత పెండింగ్‌లో ఉన్న ఆర్డర్‌లను మేము అందించగలుగుతాము" అని ప్రణవ్ వెంపతి  చెప్పారు. 

ప్రతి చేయి ధర సుమారు 3.5 లక్షలు. చేతులు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ కారణంగా వారు నిరుద్యోగులుగా ఉన్నారు.  ఇప్పుడు, మేము కొన్ని కార్పొరేట్‌లతో భాగస్వామ్యం కావాలని, అలాగే బయోనిక్ లేదా కృత్రిమ చేయి ఉన్నవారికి ఉద్యోగాలు పొందే అవకాశాలను అన్వేషించాలని చూస్తున్నాము, ”అని  అన్నారు.

also read భారతదేశంలోకి త్వరలో కొత్త బ్యాంకులు.. లైసెన్స్ కోసం ఆర్‌బిఐకి దరఖాస్తులు.. ...

డీజీ-ప్రిక్స్ ఆన్‌లైన్ ఫార్మసీ సేవల సంస్థ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను మందులను హోమ్ డెలివరీ చేస్తారు. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా  ప్రిస్క్రిప్షన్లను అప్‌లోడ్ చేసిన రోగులకు  ప్రతినెల్ మందులను డెలివరీ చేస్తుంది.

డెలివరీ కూడా ఉచితం, ఔషధ ధరలు స్థానిక ఫార్మసీల కంటే 15 శాతం వరకు చౌకగా ఉంటాయి. ఎందుకంటే డిజి-ప్రీక్స్ ఆర్డర్లు ఇవ్వడానికి పంపిణీదారులతో నేరుగా కలిసి పనిచేస్తుంది.

ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్‌ మతీన్‌ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. సమర్థ్‌ సింధీ బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. భారతదేశానికి తిరిగి రాకముందు అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేశాడు.

click me!