కరోనా బాధితులకు అండగా టాటా గ్రూప్.. ఆక్సిజన్ రవాణా కోసం భారీగా కంటైనర్ల దిగుమతి..

By S Ashok KumarFirst Published Apr 22, 2021, 3:22 PM IST
Highlights

చార్టర్డ్ విమానాల ద్వారా క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
 

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దీంతో చాలా చోట్ల ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కరోనా రోగులకు ఆక్సిజన్ కొరతను తీర్చడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. లిక్విడ్ ఆక్సిజన్ రవాణా కోసం 24 క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకోవాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.

  ఈ లిక్విడ్ ఆక్సిజన్‌ను  ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి క్రయోజెనిక్ కంటైనర్లు అవసరం. ప్రస్తుతం దేశంలో ఇలాంటి కంటైనర్ల కొరత ఉంది.

ఇలాంటి పరిస్థితిలో క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకోవడం ద్వారా  ఆక్సిజన్ సప్లయి చేయడానికి టాటా గ్రూప్ ముందు నిలిచింది. ఇది దేశంలో ఆక్సిజన్ సప్లయి కొరతను కూడా తొలగిస్తుంది. చార్టర్డ్ విమానాల ద్వారా క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తాజాగా టాటా గ్రూప్ తెలిపింది.  

also read కరోనా భయంతో నష్టాలతో ప్రారంభంమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్ ...

కరోనా మొదటి వేవ్‌లో టాటా గ్రూప్
ఇటీవల జాతీయ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయం కోసం ఓషధ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలను ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ తన ప్రసంగంలో  కోవిడ్ -19కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. గత సంవత్సరం కూడా టాటా గ్రూప్ వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు, టెస్ట్ కిట్‌లను ఏర్పాటు చేసింది.

దేశంలో ప్రతిరోజూ 7500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. ఇందులో 6600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వైద్య వినియోగం కోసం రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు.
 

click me!