Toyota Urban Cruiser Hyryder: మైలేజీతో పాటు తక్కువ ధరలో SUV కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఇది మీకోసం

By Krishna AdithyaFirst Published Aug 16, 2023, 1:11 AM IST
Highlights

లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు మంచి SUV కోసం చూస్తున్నారా. అయితే Toyota Urban Cruiser Hyryder కారు ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  

పెద్ద సైజు SUV ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఇది  ప్రతి ఇంటికి ఒక అవసరంగా మారింది. అటువంటి కారు మీకు తక్కువ ధరతో పాటు మంచి మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. తక్కువ ఖర్చుతో లాంగ్ డ్రైవ్ లను ఎంజాయ్ చేయాలని ఉందా…అయితే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ Toyota Urban Cruiser Hyryder కారు ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో అన్ని రకాల  ఫీచర్లను మిళితం చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. 

డ్యూయల్ టోన్ కలర్, రెండు పవర్‌ట్రెయిన్‌లు

ఈ కారు ఏడు ఆకర్షణీయమైన మోనోటోన్, నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులోకి వస్తోంది. ఈ కారు మైల్డ్ హైబ్రిడ్, 1.5-లీటర్ పవర్ కెపాసిటీతో స్ట్రాంగ్ అనే రెండు రకాల ఇంజిన్‌లతో వస్తుంది. తేలికపాటి ఇంజన్ 103 PS పవర్, 137 Nm టార్క్ ఉత్పత్తి చేయగా, పవర్ ఫుల్ ఇంజిన్ 116 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కంపెనీకి చెందిన 5 సీట్ల SUV కారు. ఈ కారు CNG వెర్షన్ 26.6 km/kg అధిక మైలేజీని అందిస్తుంది. ఈ డాషింగ్ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.86 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద మార్కెట్లో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్ కారు 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS వంటి అడ్వాన్స్ ఫీచర్లు

ఈ కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ,  ABS వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో కంపెనీ 11 కలర్ ఆప్షన్‌లను అందిస్తోంది. ఈ కారు టాప్ వేరియంట్ మార్కెట్లో రూ.19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

కారులో టూ వీల్ ,  ఫోర్ వీల్ డ్రైవ్

ఈ కారు  E, S, G , V 4 ట్రిమ్‌ వేరియంట్లలలో అందుబాటులో ఉంది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, CNG వేరియంట్ S, G ట్రిమ్‌లలో వస్తుంది. ఈ శక్తివంతమైన కారులో టూ వీల్, ఫోర్ వీల్ డ్రైవ్ రెండు ఎంపికలు ఉన్నాయి. ఇది నగరంలోని మృదువైన రోడ్లతో పాటు, నాణ్యత లేని రోడ్లపై కూడా మంచి పనితీరును అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో వెంటిలేటెడ్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హెడ్-అప్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ,  స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, పాడిల్ షిఫ్టర్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ,  360-డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

click me!