టొయోటా గ్లాంజా కొంటే రూ.లక్ష వరకు సేవ్ చేయొచ్చు: భారీ ఆఫర్లు ప్రకటించిన టొయోటా

Published : May 19, 2025, 09:32 PM IST
టొయోటా గ్లాంజా కొంటే రూ.లక్ష వరకు సేవ్ చేయొచ్చు: భారీ ఆఫర్లు ప్రకటించిన టొయోటా

సారాంశం

టొయోటా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లాంజా కారుపై ఏకంగా రూ.1.03 లక్షల వరకు ఆఫర్లు ఇస్తోంది. ఈ సూపర్ ఆఫర్ తో పాటు ఈ కారు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

కొత్త హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకుంటున్నారా? మీకోసం గుడ్ న్యూస్! టొయోటా కంపెనీ మే 2025లో గ్లాంజా కారుపై రూ.1.03 లక్షల వరకు ఆఫర్ ఇస్తుంది. 2024 మోడల్ కార్లపైనే ఈ ఆఫర్ ఎక్కువగా ఉంది. మరిన్ని వివరాలకు దగ్గర్లోని డీలర్‌ని సంప్రదించండి.

గ్లాంజాలో పెట్రోల్ వెర్షన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది

టొయోటా గ్లాంజాలో 90 bhp పవర్, 113 Nm టార్క్ ఇచ్చే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇదే మోడల్ లో CNG ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు మారుతి సుజుకి బలెనో, హ్యుండై i20, టాటా ఆల్ట్రోజ్ లాంటి కార్లకు పోటీనిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.90 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఉంది.

గ్లాంజా ఫీచర్లు ఇవే..

9.0 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా, క్రూజ్ కంట్రోల్, కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 6 ఎయిర్ బ్యాగులు లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఐదు సీట్ల కారు నాలుగు వేరియంట్లలో దొరుకుతుంది.

గమనిక: పైన చెప్పిన ఆఫర్లు రాష్ట్రం, నగరం, డీలర్, స్టాక్, కలర్, వేరియంట్‌ని బట్టి మారవచ్చు. కారు కొనడానికి ముందు దగ్గర్లోని డీలర్‌ని సంప్రదించి ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

PREV
Read more Articles on
click me!