ఒక వ్యక్తి రోజుకు ఎంత సంపాదించగలడు? పూర్ పీపుల్ అయితే రూ.200, రూ.500, మాక్సిమమ్ రూ.1000. అదే సాధారణ ఉద్యోగి అయితే రూ.500 నుంచి రూ.1500 మధ్యలో ఉంటుంది. వ్యాపారాలు చేసుకొనే వారైతే బిజినెస్ కెపాసిటీని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉండొచ్చు. ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్లు కూడా ఉంటారు. బాగా చదువుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయిస్, సీఈవోలు అయితే రోజుకు రూ.లక్షల్లో సంపాదిస్తారు. ఇక సినిమా హీరోలు, ప్రొడ్యూసర్ల ఆదాయం కూడా పని చేసిన రోజుల్లో రోజుకు లెక్కేస్తే రూ. కోట్లలో ఉంటుంది. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి రోజుకు అక్షరాల రూ.83 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా? కాని ఇది నిజం. ఆయన మన దేశంలో కుబేరులైన అంబానీ కాదు. అదానీ కూడా కాదు. ఆయన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మొదటి వ్యక్తి. ఇప్పటికే ఆయన టాప్ నంబర్ 1 బిలీనియర్. మరో మూడు, నాలుగేళ్లలో ప్రపంచంలోనే మొదటి ట్రిలీనియర్ కానున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక కంపెనీలున్నాయి. కొన్ని సంస్థలకు సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk). వివిధ రంగాల్లో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన సొంత సంస్థలు రోజూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఆయన సంపాదన రోజుకు అక్షరాల రూ. 83,02,60,301. అంటే సుమారు $10 మిలియన్లు. అదే నిమిషానికి రూ. 5,76,569, మరి గంటకు రూ. 3,45,94,179. 2024 ఆగస్ట్ నాటికి ఆయన సంపద రూ. 2,06,78,48 కోట్లు ఉంటుందని ఓ అంచనా.
ఎలాన్ మస్క్ స్కూలింగ్ అంతా దక్షిణాఫ్రికాలోనే పూర్తి చేశారు. తరువాత టాక్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తిని పెంచుకున్న ఆయన 1992లో కెనడాలోని క్వీన్ విశ్వవిద్యాలయంలో చేరారు. తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయ్యారు. ఆర్థిక, భౌతిక శాస్త్రాల్లో బ్యాచిలర్ డిగ్రీలు సంపాదించారు. అనంతరం 1995లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు చేరారు. అయితే 2 రోజుల్లోనే చదువు వదిలి తన సొంత ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చేందుకు బయటకు వచ్చేశారు.
undefined
ఎలాన్ మస్క్ అతని సోదరుడు కింబాల్‌తో కలిసి ఆన్‌లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ Zip2ని స్థాపించారు. ఇదే మస్క్ మొదటి విజయం. ఇది వెబ్ డైరెక్టరీ సేవలను అందించేంది. ఈ స్టార్టప్‌ను 1999లో 307 మిలియన్ డాలర్లకు కాంపాక్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 1999లోనే X.com అనే ప్రత్యక్ష బ్యాంకును స్టార్ట్ చేశారు. తరువాత ఈ సంస్థ PayPalగా మారింది. ఇది ఆన్ లైన్ పేమెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది.
మస్క్ 2002లో SpaceXను ప్రారంభించారు. ఇది ప్రైవేట్ రాకెట్ కంపెనీగా అంతరిక్ష పరిశోధనలో సంచలనాలను సృష్టించింది. 2004లో తన ఇంటర్నల్ జాగ్వార్ కార్లను విడుదల చేసి ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను క్రియేట్ చేశారు. 2006లో Solar City సంస్థను ప్రారంభించారు. తరువాత బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ నమూనాతో Neuralink కంపెనీని ప్రారంభించారు. సొరంగాలు తవ్వే The Boring Company ని స్టార్ట్ చేసి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధన్యమిస్తూ కంపెనీలు స్టార్ట చేస్తూ, కొన్ని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. టెస్లా, స్పేసఎక్స్, సోలార్‌సిటీ వంటి సంస్థల ద్వారా ఆయన ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
SpaceX తయారుచేసిన ఫాల్కన్ 1, 9 రాకెట్లు ఆయన కంపెనీ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణలని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టెస్లా మోడల్ S, X, Y వాహన రంగానికి కొత్త దారి చూపించాయి. రైల్వే టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన Hyperloop అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇది వందల కి.మీ. ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోకి మార్చేయనుంది.
మస్క్ కి మొత్తం 6 పిల్లలున్నారు. అతని మొదటి వివాహం జస్టిన్ విల్సన్ తో జరిగింది. రెండో పెళ్లి తలులై రిలేతో జరిగింది. ఈ ఇద్దరితోనూ మస్క్ విడాకులు తీసుకున్నారు. మరో ముగ్గురితో ఆయన డేటింగ్ కూడా చేశారు.
టెస్లా CEO, SpaceX యజమాని అయిన మస్క్ ఆలోచనలు, ఫైనాన్సియల్ డెసిషన్స్ ప్రపంచ కుబేరులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. న్యూ ఇన్వెన్షన్స్, కంపెనీలను శక్తివంతంగా నడపడం, వాటి ద్వారా అపారమైన సంపదను సృష్టించే కళలో మస్క్ గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆయన వెరీ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్. మస్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో జన్మించారు. ఆధునిక సాంకేతికతను డవలప్ చేసి ప్రజలకు అందించడం, కొత్త ఇన్నోవేషన్‌ను కనిపెట్టడమే తన జీవిత లక్ష్యమని చాలా సందర్భాల్లో మస్క్ వెల్లడించారు. ఖగోళ పరిశోధనలు మరిన్ని చేయడంతో పాటు, మనిషికి మార్స్ మీద నివాసాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆలోచనలను చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.