
భారతదేశంలో 16 ఆగస్టు 2022న 24 క్యారెట్లు, 22 క్యారెట్‌ల బంగారం ధర స్థిరంగా ఉంది. మంగళవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 52,460 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.48,050.
గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లోలలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 52,610 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.49,140.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లు (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,690 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 48,300. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,530 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 48,150. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,530 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,150గా ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో భారతదేశం ఒకటి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ. 44. తరువాత ఐదు సంవత్సరాలలో అంటే 1947లో ఈ ధర రెట్టింపు అయింది. 1947లో 10 కిలోల బంగారం ధర ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టికెట్ ధర కంటే తక్కువ. ఇండియన్ పోస్ట్ గోల్డ్ కాయిన్ సర్వీసెస్ సమాచారం ప్రకారం, ఆ సమయంలో దీని ధర రూ.88.62.
1970లో బంగారం సగటు ధర రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200. 2000 నుండి 2010 మధ్యకాలంలో బంగారం ధర రూ.4,400 నుండి రూ.18,500కి చేరుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత 10 గ్రాముల బంగారం ధర దాదాపు 300 రెట్లు పెరిగింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530గా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ. 64,800గా ఉంది.