SBI Fixed Deposit: ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారా..అయితే ఇది మీకు బంపర్ ఆఫర్..

By Krishna AdithyaFirst Published Aug 16, 2022, 10:25 AM IST
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచింది. దీని తరువాత, దేశంలోని ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా FD (Fixed Deposit)లపై వడ్డీ రేట్లు పెంచాయి. ఇప్పుడు ఇండస్‌ఇండ్ బ్యాంక్ పేరు కూడా ఆ కోవలేకి చేరింది. ఎందుకంటే బ్యాంక్ FD (Fixed Deposit) వడ్డీ రేటును 6.75 శాతానికి పెంచింది. ఇది నేరుగా వినియోగదారులకు మేలు చేస్తుంది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ కంటే ముందే, ఎస్‌బిఐ, యాక్సిస్‌తో సహా అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల, FD (Fixed Deposit)పై వడ్డీని పెంచాయి. ప్రస్తుతం, ఐదేళ్ల పాటు డిపాజిట్ స్కీమ్‌లు, ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టడానికి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఏ బ్యాంకులో FD (Fixed Deposit) వడ్డీ రేటు ఎంత
>> స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది
>> యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది
>> ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇప్పుడు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది
>> యెస్ బ్యాంక్ కూడా 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది
>> ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.60 శాతం వడ్డీని అందిస్తుంది
(గమనిక- ఈ రేట్లు 5 సంవత్సరాల FDలపై వర్తిస్తాయి)

FD (Fixed Deposit)పై వడ్డీ రేటు ఎంత
'సేవింగ్స్, కరెంట్ అకౌంట్ వడ్డీ కంటే FDపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ వడ్డీ రేటు 15 శాతం ఉండగా ప్రస్తుతం 7 నుంచి 9 శాతం మధ్య ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. మీరు పొదుపు ఖాతా FD చేస్తే, మొత్తం 4 నుండి 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. 

FD (Fixed Deposit) ప్రయోజనాలను కూడా తెలుసుకోండి
FD పెట్టుబడి అనేది మార్కెట్ అస్థిరత వల్ల ప్రభావితం కానందున సురక్షితమైనది
FDలో డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఇతర రకాల ఖాతాల కంటే ఎక్కువగా ఉంటుంది.
FDపై 5 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీకి కూడా పన్ను లేదు
FD ఖాతాపై కూడా లోన్ తీసుకోవచ్చు, దానిని సులభంగా తిరిగి చెల్లించవచ్చు
బ్యాంకులే కాకుండా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా FD (Fixed Deposit) సౌకర్యాన్ని అందిస్తాయి.

click me!