Petrol, Diesel Price:క్రూడాయిల్ ధరలో పతనం.. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 84కే..

Published : Aug 16, 2022, 10:18 AM ISTUpdated : Aug 16, 2022, 10:20 AM IST
Petrol, Diesel Price:క్రూడాయిల్ ధరలో పతనం.. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 84కే..

సారాంశం

ఇంధన డిమాండ్‌పై ప్రభావం పడుతుందన్న భయంతో సోమవారం, మంగళవారం ఉదయం కూడా క్రూడ్‌ ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఉదయం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1% తగ్గి బ్యారెల్‌కు $94.20 వద్ద ట్రేడవుతున్నాయి.

న్యూఢిల్లీ: ఈరోజు మంగళవారం 16 ఆగస్టు 2022న  ఇండియాలో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లలో పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎటువంటి సవరణలు చేయలేదు. అయితే, ప్రపంచ కారకాల ప్రభావంతో ముడి చమురు మార్కెట్‌లో క్షీణత నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు నేడు భారీగా తగ్గాయి. 

ఇంధన డిమాండ్‌పై ప్రభావం పడుతుందన్న భయంతో సోమవారం, మంగళవారం ఉదయం కూడా క్రూడ్‌ ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఉదయం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1% తగ్గి బ్యారెల్‌కు $94.20 వద్ద ట్రేడవుతున్నాయి. US WTI బ్యారెల్‌కు 0.9% తగ్గి $ 88.60కి చేరుకుంది. సోమవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు సుమారు 3% తగ్గాయి.

దేశంలోని కొన్ని నగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలు

నగరం    పెట్రోల్    డీజిల్
ఢిల్లీ           96.72    89.62
కోల్‌కతా    106.03    92.76
ముంబై      106.35    94.28
చెన్నై        102.63    94.24
నోయిడా     96.79    89.96
లక్నో          96.79    89.76
పాట్నా       107.24    94.04
జైపూర్        108.48    93.72
హైదరాబాద్‌  109.66  97.82
పోర్ట్ బ్లెయిర్   84.10     79.74

దేశంలోని అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ ధరల ప్రకారం దేశీయ ఇంధన ధరలు ప్రతిరోజూ సవరించబడతాయి. అయితే కొత్త ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి  వర్తిస్తాయి. ఇంట్లో కూర్చొని కూడా ఇంధన ధరలను తెలుసుకోవచ్చు.  మీరు ఇండియన్ ఆయిల్ మెసేజ్ సర్వీస్ కింద 'RSP-పెట్రోల్ పంప్ కోడ్'  మొబైల్ నంబర్ 9224992249కి SMS పంపాలి.  రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !