ఆరలక్షకు పైనే బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jul 22, 2020, 11:04 AM ISTUpdated : Jul 22, 2020, 10:30 PM IST
ఆరలక్షకు పైనే బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే ?

సారాంశం

 తులం ధర యాభై వేలకు పై మాటే పలుకుతున్నది. మంగళవారం ఢిల్లీలో తులం  బంగారం ధర ఏకంగా రూ.50,214ను తాకింది. సోమవారంతో పోల్చితే ధరలో రూ.192 పెరిగింది. 

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్ళీ  ఎగిసిపడుతున్నాయి. తులం ధర యాభై వేలకు పై మాటే పలుకుతున్నది. మంగళవారం ఢిల్లీలో తులం  బంగారం ధర ఏకంగా రూ.50,214ను తాకింది.

సోమవారంతో పోల్చితే ధరలో రూ.192 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.

ఈ కారణంగా మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ లేకున్నా ధరలకు రెక్కలొస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు పరుగు ఆగట్లేదు. కిలో వెండి ధర నేడు ఒక్కరోజే రూ.1,832 ఎగిసి రూ.56,441ని చేరింది.

also read బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ రాజీనామా.. పడిపోయిన కంపెనీ షేర్లు.. ...

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,822 డాలర్లుగా నమోదైంది. వెండి 20.36 డాలర్లుగా ట్రేడైంది. ‘కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకునేందుకు అమెరికా, ఐరోపా యూనియన్‌లు  మరిన్ని ఉద్దీపనలను ప్రకటిస్తాయన్న ఆశలు కూడా బంగారం ధరలను అంతకంతకూ పెంచేస్తున్నాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అన్నారు.

బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగితే దీపావళి వరకు తార స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,320 ఉంది. వెండి కిలో ధర రూ.55,400. 

PREV
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు