భ‌విష్య‌త్తులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ ఎవ‌రైనా కావొచ్చు : రతన్ టాటా

Ashok Kumar   | Asianet News
Published : Jul 21, 2020, 05:07 PM ISTUpdated : Jul 21, 2020, 10:33 PM IST
భ‌విష్య‌త్తులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ ఎవ‌రైనా కావొచ్చు : రతన్ టాటా

సారాంశం

 "నేను టాటా  ట్రస్టుల ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో 'టాటా' అనే ఇంటిపేరుతో కాకుండా మరెవరైనా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ కావచ్చు. 

హైద‌రాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కీలకమైన విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో టాటా ట్రస్ట్స్ కు  ఛైర్మన్ గా  టాటా కుటుంబంతో సంబంధం లేని వారు కావచ్చు అని ట్రస్ట్ ప్రస్తుత చైర్మన్ రతన్ టాటా సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రకటనలో తెలిపారు.

"నేను టాటా  ట్రస్టుల ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో 'టాటా' అనే ఇంటిపేరుతో కాకుండా మరెవరైనా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ కావచ్చు. ఒక వ్యక్తి జీవితం కొంతకాలమే, కానీ సంస్థలు ఎల్లకాలం కొనసాగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.

టాటా ట్రస్ట్ చైర్మన్ పదవికి టాటా కుటుంబానికి సొంత  హక్కులు లేవని రతన్ టాటా చెప్పారు. సైరస్  ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా టాటా మాట్లాడుతూ ప్రస్తుత టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా కుటుంబానికి చెందినవారు కాదు అని తెలిపారు.

also read బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఇక వారంలో 5 రోజులు మాత్రమే బ్యాంకులు ఓపెన్.. ...

"టాటా కుటుంబ సభ్యులకు (వ్యవస్థాపకుడి వారసులు / బంధువులు) సంబంధించినంత వరకు టాటా సన్స్ సంస్థ లేదా దాని నిర్వహణలో హక్కులు కాకుండా ప్రత్యేక హక్కు లేదా  ఇంతవరకు ఎవరికి నిర్దేశించలేదు లేదా ఇవ్వలేదు.

సంస్థలో వాటాదారుగా వారు చట్టం ప్రకారం ఉంటారు "అని ఆయన చెప్పారు. టాటా సన్స్‌లో తాను అతని బంధువులు 3 శాతం కన్నా తక్కువ వాటా కలిగి ఉన్నారని రతన్ టాటా పేర్కొన్నారు. టాటా ట్ర‌స్ట్స్ మేనేజ్మెంట్‌ను వ్య‌వ‌స్థీక‌రించేందుకు రతన్ టాటా వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తుల కమిటీని ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఒక ప్రచురణకు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?