వారం చివరిలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు పెట్రోల్ ధర ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Aug 29, 2020, 11:48 AM IST
Highlights

మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు అయితే ఈ వారంలో ఐదుసార్లు, గత 14 రోజుల్లో 11 సార్లు పెరిగాయి. ఢీల్లీలో ఆగస్టు 23 ఆదివారం నుండి ఆగస్టు 28 శుక్రవారం వరకు పెట్రోల్ ధరలను 59 పైసలు పెంచారు.

వరుస పెరుగుదల తరువాత వారం చివరిలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా నిలిచాయి. మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు అయితే ఈ వారంలో ఐదుసార్లు, గత 14 రోజుల్లో 11 సార్లు పెరిగాయి.

ఢీల్లీలో ఆగస్టు 23 ఆదివారం నుండి ఆగస్టు 28 శుక్రవారం వరకు పెట్రోల్ ధరలను 59 పైసలు పెంచారు. మొత్తంమీద ఆగస్టు 16 నుండి దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు రూ.1.51  పెరిగింది. రాష్ట్ర చమురు కంపెనీలు ఆగస్టు 16 నుండి పెట్రోల్ రేట్లను పెంచడం ప్రారంభించాయి.

దీనికి ముందు, ఈ ఏడాది జూన్ 29న పెట్రోల్ రేట్లు పెరిగాయి. అదేవిధంగా ముంబైలో ఆగస్టు 16 నుండి పెట్రోల్ ధరలను 1.39 రూపాయలు పెంచారు. గత వారంలో పెట్రోల్ రేట్లు 56 పైసలకు పెరిగాయి.

ప్రస్తుతం ఢీల్లీలో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ.81.94, ముంబైలో లీటరుకు రూ.88.58 గా ఉన్నాయి. శనివారం రోజున కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలలో పెట్రోల్ లీటరుకు రూ .83.43 నుండి రూ.85.15 / లీటరుకు లభిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో, ముడి ధర కూడా ధృడంగా ఉంది, బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి బ్యారెల్కు 45.05 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 2013లో బ్రెంట్ స్పాట్ ధర బ్యారెల్కు 116.27డాలర్లుగా ఉంది. అయితే, ఆ సమయంలో భారతదేశంలో పెట్రోల్ ధర ఢీల్లీలో లీటరుకు దాదాపు 72 రూపాయలు.

మరోవైపు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్‌ ధరలు  ప్రస్తుతం  యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి.

also read ముఖేష్ అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

డీజిల్ ధర ఢీల్లీలో లీటరుకు రూ.73.56, ముంబైలో రూ.80.11.
చెన్నై డీజిల్ ధర రూ .78.86, కోల్‌కతాలో రూ .77.06 గా ఉంది.
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర నేడు ఆగస్టు 29న రూ .85.15 / లీటరు
బెంగళూరులో పెట్రోల్ ధర నేడు, ఆగస్టు 29న రూ .84.60 / లీటరు


ఢీల్లీలో నేడు ఆగస్టు 29న డీజిల్ లీటరుకు రూ .73.56
ముంబైలో డీజిల్  లీటరుకు రూ .80.11
 చెన్నైలో డీజిల్ ధర రూ .78.86 / లీటరు
కోల్‌కతాలో డీజిల్ లీటరుకు రూ .77.06
హైదరాబాద్‌లో డీజిల్ లీటరుకు రూ .80.17
బెంగళూరులో డీజిల్ లీటరుకు రూ. 77.88 రూపాయలు

click me!