జియోమార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్.. అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్..

By Sandra Ashok KumarFirst Published Aug 28, 2020, 11:56 AM IST
Highlights

"నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తు, మాలాగా వ్యవహరిస్తు లేదా మాతో సంబంధం కలిగిన పేరుతో, జియోమార్ట్ సేవల ఫ్రాంచైజీల మంటూ అమాయక వ్యక్తులను మోసం చేస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి మాకు సమాచారం అందింది" అని సంస్థ ఒక నోటీసులో తెలిపింది. 

న్యూ ఢీల్లీ: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఆన్‌లైన్ గ్రోసారి షాపింగ్ జియోమార్ట్ పేరు మీద ఫ్రాంఛైజీలను కోరుతున్న నకిలీ వెబ్‌సైట్‌లను హెచ్చరించింది.

ప్రస్తుతం ఏ డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీలను ఆపరేట్ చేయడం లేదని పేర్కొంది. "నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తు, మాలాగా వ్యవహరిస్తు లేదా మాతో సంబంధం కలిగిన పేరుతో, జియోమార్ట్ సేవల ఫ్రాంచైజీల మంటూ అమాయక వ్యక్తులను మోసం చేస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి మాకు సమాచారం అందింది" అని సంస్థ ఒక నోటీసులో తెలిపింది.

జియోమార్ట్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ గ్రోసారి సేవలను ఇటీవల ప్రారంభించినట్లు రిలయన్స్ రిటైల్ తెలిపింది. "మేము ప్రస్తుతం ఏ డీలర్షిప్ లేదా ఫ్రాంఛైజీలను ఆపరేట్ చేయటం లేదని, మేము ఏ ఫ్రాంఛైజీని లేదా ఏ ఏజెంట్‌ను నియమించలేదని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాము.

ఏ డీలర్షిప్ లేదా ఫ్రాంఛైజీని ఏ విధంగా నియమించలేదు. ఇంకా మేము ఫ్రాంఛైజీలను నియమించే పేరుతో ఎటువంటి మొత్తాన్ని వసూలు చేయము."అని తెలిపింది. మే నెలాలో రిలయన్స్ తన ఆన్‌లైన్ గ్రోసారి షాపింగ్ పోర్టల్‌ను భారతదేశం అంతటా ప్రారంభించింది.

also read 

జియోమార్ట్ షాపింగ్ యాప్ స్థానిక కిరానా దుకాణాలను వాట్సాప్ ద్వారా వినియోగదారులతో కలుపుతుంది. "ప్రజలు, తయారీదారులు, వ్యాపారులు, డీలర్లు ఇటువంటి వ్యక్తుల ఆన్‌లైన్ మోసలపై  జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వ్యక్తులతో వ్యవహరించే ఏ వ్యాపారామైన మేము బాధ్యత వహించబోమని హెచ్చరిస్తున్నము" అని కంపెనీ నోటీసులో పేర్కొంది.

మా బ్రాండ్‌ను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.

రిలయన్స్ రీటైల్ పేర్కొన్న నకిలీ వెబ్‌సైట్స్  
1. jmartfranchise.in
2. jiodealership.com
3. jiomartfranchises.com
4. jiomartshop.info
5. jiomartreliance.com
6. jiomartfranchiseonline.com
7. jiomartsfranchises.online
8. jiomart-franchise.com
9. jiomartindia.in.net
10. jiomartfranchise.co

click me!