తగ్గిన డీజిల్ ధరలు.. నేడు పెట్రోల్ లీటరుకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Sep 29, 2020, 05:04 PM ISTUpdated : Sep 29, 2020, 11:18 PM IST
తగ్గిన డీజిల్ ధరలు.. నేడు పెట్రోల్ లీటరుకు ఎంతంటే ?

సారాంశం

నేడు డీజిల్ ధరపై ప్రభుత్వ చమురు కంపెనీలు 8 పైసలు తగ్గించాయి. గత ఏడు రోజులుగా పెట్రోల్  ధరలో ఎటువంటి మార్పు లేదు. మంగళవారం దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.81.06 వద్ద ఉండగా డీజిల్ ధర లీటరుకు 70.63 రూపాయలకు చేరుకుంది.

గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు వరుసగా దొగోస్తున్నాయి. నేడు డీజిల్ ధరపై ప్రభుత్వ చమురు కంపెనీలు 8 పైసలు తగ్గించాయి. గత ఏడు రోజులుగా పెట్రోల్  ధరలో ఎటువంటి మార్పు లేదు.

మంగళవారం దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.81.06 వద్ద ఉండగా డీజిల్ ధర లీటరుకు 70.63 రూపాయలకు చేరుకుంది.  ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి


ఢిల్లీ లో లీటర్ డీజిల్ ధర రూ.70.63, పెట్రోల్ ధర రూ.81.06

కోల్‌కతాలో డీజిల్ ధర రూ.74.15, పెట్రోల్ ధర రూ.82.59

ముంబైలో డీజిల్ ధర రూ.77.04, పెట్రోల్ ధర రూ. 87.74

చెన్నైలో  డీజిల్ ధర లీటరుకు రూ.76.10, పెట్రోల్ ధర రూ. 84.14

మీ నగరంలో పెట్రోల్-డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే మీరు ఆర్‌ఎస్‌పి, మీ సిటీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు  పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లను ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలను బట్టి విదేశీ మారకపు రేటు ఉంటుంది. 

హైదరాబాద్ లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.84.25 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటరుకు 74.73 రూపాయలుగా ఉంది.  

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు