మోటారు వాహనాల నిబంధనలులో కీలక మార్పులు.. అక్టోబర్ 1 నుండి అమలు..

By Sandra Ashok KumarFirst Published Sep 29, 2020, 3:50 PM IST
Highlights

ప్రభుత్వం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ 2020 అక్టోబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు రహదారిపై ప్రజలను ఆపి వాహనాల పత్రాల తనిఖీలు ఉండవు. 

కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ 1989 మోటారు వాహనాల నిబంధనలులో అనేక మార్పులు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ 2020 అక్టోబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు రహదారిపై ప్రజలను ఆపి వాహనాల పత్రాల తనిఖీలు ఉండవు.

దేశంలో ఐటి సేవలు, ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ నియమాలను మెరుగైన రీతిలో అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే ట్రాఫిక్  రూల్స్ ఉల్లంఘిస్తే వాహన యజమానులకు ఇ-చలాన్ విధిస్తుంది.

also read భారతదేశపు అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెలు..

ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1 నుండి ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహన తనిఖీకి స్వస్తి పలకనున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ నుంబర్ ద్వారా పత్రాల ఇ-ధృవీకరణ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు పై వాహన డ్రైవర్ల నుండి భౌతిక పత్రాలు డిమాండ్ చేయరు. 

ఇప్పుడు డ్రైవర్ల సమాచారం అంతా పోర్టల్‌లో నమోదు చేయబడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. ఈ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతుంది. ధృవీకరణ పత్రాలను భౌతిక లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ పోర్టల్‌లో పొందవచ్చు. 

కొత్త నిబంధనల ప్రకారం డ్రైవర్ డ్రైవింగ్ చేసేటప్పుడు జిపిఎస్ పరికరాలను ఉపయోగించగలుగుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడటం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అని గుర్తుంచుకోవాలి.

click me!