ఫెస్టివల్ బంపర్ ఆఫర్ : ఒక రూపాయికే బైక్..

By Sandra Ashok KumarFirst Published Sep 28, 2020, 11:38 AM IST
Highlights

పండగ సీజన్ లో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలని చూస్తున్న వారికి  ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.  ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. 

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ప్రజలు సొంత వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగ సీజన్ లో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలని చూస్తున్న వారికి  ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.

 ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఇందుకోసం  1 రూపాయి చెల్లించి బైక్ బుక్ చేసుకోవచ్చు అని ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, టివిఎస్ మోటార్ ఎంపిక చేసిన షోరూమ్‌లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల  ఈఎంఐను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

also read 

5676762  నంబర్‌కు  DC - space - EMI అని టైప్ చేసి ఒక ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా లేదా 7812900900 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కస్టమర్లు ఈ‌ఎం‌ఐ గురించి తెలుసుకోవచ్చు.

500 సిసి ఇంజన్ కంటే తక్కువ బైక్‌లపై బ్యాంకు 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.  ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుపై ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూమ్‌లలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్‌గా 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

భారతదేశం అంతటా ఉన్న 36వేల దుకాణాలలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈ‌ఎం‌ఐని అందిస్తుంది. ఈ-కామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోళ్లపై కూడా బ్యాంక్ ఇటీవల ఈ‌ఎం‌ఐని అందించడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా  ఫెడరల్ బ్యాంక్ 1,000కి పైగా శాఖలతో ప్రముఖ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకుగా విస్తరించింది.
 

click me!