కొనసాగుతున్న ఇంధన ధరల పరుగు.. వరుసగా 12వ రోజు కూడా పెంపు..

By S Ashok KumarFirst Published Feb 20, 2021, 12:18 PM IST
Highlights

ఇంధన ధరల పెంపు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో  పెట్రోల్ ధర ఇప్పటికే  రూ.100 దాటేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే వరుస పెంపు కొనసాగితే మరో కొద్దిరోజుల్లు ఇంధన ధర సెంచరీ కొట్టేస్తుంది.

గత కొద్దిరోజులుగా వరుస ఇంధన ధరల పెంపు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో  పెట్రోల్ ధర ఇప్పటికే  రూ.100 దాటేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే వరుస పెంపు కొనసాగితే మరో కొద్దిరోజుల్లు ఇంధన ధర సెంచరీ కొట్టేస్తుంది. తాజాగా నేడు దేశంలోని  ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను  పెంచాయి. నేడు డీజిల్ ధర 37 నుండి 39 పైసలకు పెరిగా, పెట్రోల్ ధర కూడా 38 నుండి 39 పైసలకు పెరిగింది.  

ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు రోజురోజుకి గరిష్ట స్థాయికి చేరుకొని కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో ఢీల్లీలో పెట్రోల్ ధర 90.58 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 80.97 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 97 రూపాయలకు, డీజిల్ ధర లీటరుకు 88.06 డాలర్లకు చేరుకుంది.  

నేడు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో  ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి.
  
నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         80.97    90.58
కోల్‌కతా    84.56    91.78
ముంబై    88.06    97.00
చెన్నై       85.98    92.59
ఇండోర్    89.34    98.69
హైదరాబాద్‌   88.31    94.18

 

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో  సామాన్యులని రెండు లీటర్ల పెట్రోల్లో నెల మొత్తం డ్రైవ్ చేయగలరా అని ఎవరైనా అడిగితే? సమాధానం ఉండదు, కానీ  కొన్ని ప్రభుత్వలు  ఉద్యోగుల నుండి సమాధానం కోరుకుంటుంది.

ఒక వైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రలలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ వాహన భత్యంగా నెలకు రూ .200 మాత్రమే ఇస్తున్నారు.  2012 సెప్టెంబర్‌లో   కొన్ని రాష్ట్ర ప్రభుత్వలు వాహన భత్యం మొత్తాన్ని రూ .50 నుంచి రూ .200 కు పెంచింది.  

click me!