ఎస్‌బి‌ఐ కస్టమర్లకు హెచ్చరిక: మీ బ్యాంక్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి.. లేదంటే ?

By S Ashok KumarFirst Published Feb 19, 2021, 3:17 PM IST
Highlights

ఏదైనా ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ తప్పనిసరి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కస్టమర్ల కోసం ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది.

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ తప్పనిసరి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కస్టమర్ల కోసం ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ హెచ్చరిక ఆధార్ కార్డు అలాగే ఎస్‌బి‌ఐ ఖాతా గురించి. 

ఎస్‌బిఐ  ట్వీట్
ఎస్‌బిఐ  ఒక ట్వీట్ లో స్పష్టంగా  పేర్కొంది, 'కస్టమర్లు బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతా ఆధార్‌తో అనుసంధానించకపోతే, మీరు భారత ప్రభుత్వం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా రాయితీని పొందాలేరు.

also read 

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఎటిఎం నుండి, ఎస్‌బి‌ఐ ఎనీవేర్ యాప్ నుండి లేదా బ్యాంకు శాఖకు వెళ్ళడం ద్వారా మీ  సేవింగ్స్ అక్కౌంట్  కి ఆధార్ లింక్ చేయవచ్చు . మీరు దీన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో చేయాలనుకుంటే, మీ నెట్ బ్యాంకింగ్ ఆన్ చేయాలి. 

దీని కోసం మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇక్కడ 'ఆధార్ నంబర్ విత్ బ్యాంక్' లింక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ నంబరును లింక్ చేయడానికి స్క్రీన్ పైన చూపిన నియమాలను అనుసరించండి.  

ఆధార్ లింక్ స్టేటస్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు తెలియజేస్తుంది. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం సుప్రీంకోర్టు తప్పనిసరి చేయలేదు, కాని ప్రభుత్వ రాయితీ బ్యాంకు ఖాతాకు వస్తే, మీరు ఖాతాకు ఆధార్ నంబర్‌ను తప్పనిసరి లింక్ చేయాల్సి ఉంటుంది. 

 

We would like to inform our customers that Aadhaar Card seeding is mandatory for those desirous of receiving any benefit or subsidy from Govt. of India through Direct Benefit Transfer. pic.twitter.com/EICJUbBeVC

— State Bank of India (@TheOfficialSBI)
click me!