Petrol Diesel Prices Today: మార్పులేదు.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

By team teluguFirst Published Jan 24, 2022, 9:25 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఏడేళ్ల గరిష్ట స్థాయిలకి క్రూడాయిల్ ధరలు ఎగిసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు సుమారు ఒక బ్యారల్ 90 డాలర్లుగా నమోదవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఏడేళ్ల గరిష్ట స్థాయిలకి క్రూడాయిల్ ధరలు ఎగిసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు సుమారు ఒక బ్యారల్ 90 డాలర్లుగా నమోదవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో భవిష్యత్‌లో కమోడిటీ ధరలు పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు నమోదవుతున్నాయి. 2014 తర్వాత ఇవే అత్యధిక స్థాయిలు.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం ధరలలో ఎలాంటి మార్పు లేదు.

నేటి పెట్రోల్, డీజిల్ రేట్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసింది. నేడు కూడా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చలేదు. గత రెండున్నర నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు మారడం లేదు. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మారాయి.

ప్రధాన నగరాలలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు


 - ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 - ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. కానీ గత రెండున్నర నెలలుగా ధరలలో ఎలాటి మార్పును చేపట్టలేదు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. కాగా, ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకే పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు అమల్లోకి వస్తూ ఉంటాయి.

click me!