Today Gold And Silver Prices: త‌గ్గిన ధ‌ర‌లు.. నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 10:06 AM IST
Today Gold And Silver Prices: త‌గ్గిన ధ‌ర‌లు.. నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

సారాంశం

పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్గించే అంశం. బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి.  

పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్గించే అంశం. బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి.

బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ప‌సిడి ధర రూ.52,100 వద్ద కొన‌సాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 వద్ద ఉంది.  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 500 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 640 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 500 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 640 రూపాయలుగా ఉంది.  ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,900 లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,900 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,900లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 64,900లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,900గా ఉంది. కేరళలో కిలో వెండి ధర 69,000 లుగా కొనసాగుతోంది. కాగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది.  విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?