గత కొద్ది రోజులగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. బంగారం, క్రూడ్ అయిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి, ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చు తగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావితమవుతాయి.
నిన్నటితో పోల్చుకుంటే ఇవ్వాళ బంగారం రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో శుక్రవారం రోజు 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము బంగారం ధర రూ.3830 ఉంటే అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3793కి చేరింది. దీంతో 1గ్రాము బంగారం ధరపై సుమారు 37 వ్యతాసం ఉంది.
undefined
also read ఇరాన్ పై డ్రోన్ దాడుల తరువాత... చైనాతో అమెరికా ఫ్రెండ్ షిప్...కారణం..?
నిన్న 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము బంగారం ధర రూ.4.179 ఉంటే అదే 24 క్యారెట్ల బంగారం ధర నేటికి రూ.4,178కి చేరింది. దీంతో 1గ్రాము బంగారం ధరపై సుమారు రూపాయి వ్యతాసం ఉంది.హైదరాబాద్ శుక్రవారం మార్కెట్ లో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.38,300 ఉంది. ఇవ్వాళ 37,930కి చేరింది. దీంతో 10గ్రాముల బంగారం ధరపై రూ.370 తగ్గింది.
నిన్న 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర 41,790 ఉంటే అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.41,780కి చేరింది. దీంతో నిన్నటికి ఇవ్వాల్టికి రూ.10 వ్యత్యాసం కనిపిస్తోంది.
విజయవాడ, విశాఖ లో పదిగ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.విజయవాడలో రూ.22క్యారెట్ల బంగారం రూ.37,930 ఉంటే రూ.24 క్యారట్ల బంగారం ధర రూ. 41,780 ఉంది. వైజాగ్ లో 22క్యారెట్ల బంగారం ధర 37,930 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,780 ఉంది.
also read వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,700, 24క్యారట్ల బంగారం ధర రూ. 39,900 ఉంది.
ఇక ఈరోజు వెండి ధరల విషయానికొస్తే
1గ్రాము వెండి ధర రూ. 49.10
10గ్రాముల వెండి ధర రూ. 491
100 గ్రాముల వెండి ధర రూ. 4910
1000 గ్రాముల వెండి ధర రూ. 49,100 ఉంది.