ఇరాన్ పై డ్రోన్ దాడుల తరువాత... చైనాతో అమెరికా ఫ్రెండ్ షిప్...కారణం..?

By Sandra Ashok Kumar  |  First Published Jan 10, 2020, 1:34 PM IST

చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫా చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.


వాషింగ్టన్: వాణిజ్య యుద్ధంతో దాదాపు రెండేళ్లుగా అమెరికా-చైనా వార్తల్లో నిలిచాయి. కానీ ఈ రెండు దేశాలు ఇప్పుడు స్నేహగీతం పాడుతునట్టు కనిపిస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత ఈ నెల 15న ఇరు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. 

also read వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Latest Videos

మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పూర్తి కాక ముందే రెండో దశ ఒప్పందంపై సంకేతాలిచ్చారు ట్రంప్​. ఆలస్యం కాకుండానే రెండో దశ ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభమవుతాయని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు. కానీ ఈ చర్చల ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.

"ఫేజ్​ 2 కోసం వెంటనే సంప్రదింపులు ప్రారంభిస్తాం. కానీ ఎన్నికల వరకూ వేచి చూడాలి. ఆ తర్వాతే మంచి, మెరుగైన ఒప్పందం కుదుర్చుకోవచ్చు" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఇన్నేళ్లు నడిచిన మాటల యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. 

also read ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

తొలుత చైనాకు చెందిన 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించగా.. ప్రతిగా చైనా సైతం 110 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. దీనిపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. రెండు దేశాల వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

అనేక దశలుగా సాగిన చర్చల అనంతరం గతేడాది డిసెంబర్​లో అమెరికా-చైనా మధ్య తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై సంధి కుదిరింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో బీజింగ్​ నుంచి ఓ బృందం అమెరికాకు వెళ్లనునట్టు తెలుస్తోంది.

click me!