ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి టిక్‌టాక్ వ్యవస్థాపకుడు.. త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్

By S Ashok KumarFirst Published Apr 14, 2021, 7:35 PM IST
Highlights

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి ఇప్పుడు టిక్‌టాక్ వ్యవస్థాపకుడు చేరారు. ఇప్పుడు పోనీ మా, ఝంగ్ షాన్షాన్ తో సమానంగా నిలిచారు.
 

ప్రపంచంలోని అత్యంత విలువైన స్టార్టప్ బైట్‌డాన్స్ లిమిటెడ్ గత సంవత్సరంలో కొన్ని ఆగ్రా దేశాల ఒత్తిడికి గురైన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా  బైట్ డ్యాన్స్ వ్యవస్థాపకుడు 38 ఏళ్ల జంగ్ యిమింగ్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో  చేరారు. 

బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం  ప్రైవేట్ మార్కెట్లో కంపెనీ షేర్లు 250 బిలియన్ డాలర్ల కంటే పైగా ఎగిశాయి అని దీని గురించి తెలిసిన వ్యక్తులు తెలిపారు. దీంతో బైట్‌డాన్స్‌లో నాలుగింట ఒక వంతు యజమాని అయిన జంగ్ యిమింగ్  విలువ 60 బిలియన్ డాలర్లకు పైగా చేరింది. ఇప్పుడు అతను టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్  పోనీ మా, బాటిల్-వాటర్ కింగ్ ఝంగ్ షాన్షాన్, వాల్టన్ అండ్ కోచ్ ఫ్యామిలీ సభ్యులతో సమానంగా నిలిచారు.

also read 

షార్ట్-వీడియోస్ యాప్, న్యూస్ అగ్రిగేటర్ టౌటియావోలకు ప్రసిద్ధి చెందిన బైట్‌డాన్స్ గత సంవత్సరం  అడ్వెటైజింగ్ మించి ఇ-కామర్స్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి రంగాలలోకి విస్తరించిన తరువాత  దాని ఆదాయాన్ని రెట్టింపు చేసింది.

త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కూడా ప్రారంభించనుంది. ఫండ్ రైజింగ్ లో  బైట్‌డాన్స్ 180 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంది.  అయితే బైట్‌డాన్స్ ప్రతినిధులు దీనిపై  స్పందించడానికి నిరాకరించారు.

click me!