ముకేష్ అంబానీ చేతికి 261 ఏళ్ల బ్రిటిష్ పాపులర్ టాయ్ స్టోర్.. 89 మిలియన్ డాలర్లకి కొనుగోలు..

By S Ashok KumarFirst Published Apr 13, 2021, 2:42 PM IST
Highlights

బ్రిటిష్ బొమ్మల కంపెనీ యు.కె. పాపులర్ స్టోర్ హేమ్లీస్‌ను  2019లో ముకేష్ అంబానీ  చేజిక్కిచుకున్నారు. అయితే అంబానీకి చెందిన సంస్థ రిలయన్స్ ఈ బొమ్మల కంపెనీ స్టోర్లను కొత్తగా తెరవాలని యోచిస్తోంది.  

దేశంలోని అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ  261 ఏళ్ల యు.కె. పాపులర్ టాయ్ స్టోర్ కంపెనీ హేమ్లీస్‌ ఆర్ధికంగా మునిగిపోకుండా ఉండడానికి సహాయపడుతూన్నారు. ఇందుకోసం హేమ్లీస్‌ కంపెనీ  టాయ్ స్టోర్ మార్కెట్‌ను భారతదేశంలోకి విస్తరించాలని యోచిస్తున్నారు.

అలాగే యూరప్, దక్షిణాఫ్రికా, చైనా మొదలైన దేశాలలో కూడా స్టోర్లను కంపెనీ ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని అంబానీ రిలయన్స్ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా వెల్లడించారు.

హేమ్లీస్ అనేది ఒక బ్రిటిష్ రిటైల్ ఐకాన్  టాయ్ స్టోర్. ఇది చాలా సంవత్సరాలుగా లాభాలను ఆర్జించలేక  నష్టాల్లో కొనసాగుతుంది . కానీ 2019 సంవత్సరంలో ముకేష్  అంబానీ హామ్లీస్‌ను కొనుగోలు చేశాడు. దీంతో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ కంపెనీ మార్కెట్లో నిలకడగా ఉంది.

భారతదేశంలో అభివృద్ధి అవకాశాలు
దర్శన్ మెహతా ప్రకారం, బ్రిటిష్ బొమ్మల సంస్థ హేమ్లీస్  క్షీణిస్తున్న పరిస్థితిని మెరుగుపరచడంలో ముకేష్ అంబానీ కొత్త లైఫ్ అందించాడు. హేమ్లీస్  టాయ్స్ గ్లోబల్ అమ్మకాల వాటాను గత ఏడాది యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ 0.6% గా అంచనా వేసింది.

also read ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ ఒక్క రోజు సెక్యూరిటి ఖర్చు ఎంతో తెలుసా.. మరి సంవత్సరానికి ? ...

అలాగే ఇతర ప్రత్యర్థి బొమ్మల కంపెనీలకి పోటీగా నిలుస్తుంది. భారతదేశంలో  27% మంది పిల్లలు 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.  ఈ కారణంగా బొమ్మల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.

 "మేము బొమ్మల కంపెనీని కొత్త ఫార్మాట్లలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే స్టోర్లను ఎలా ప్రారంభించలో  సన్నాహాలు చేస్తున్నాం" అని మెహతా చెప్పారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున  భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని భాగాలు కూడా ముప్పులో ఉన్నాయి.

అయితే వీటన్నిటి మధ్య బొమ్మల పరిశ్రమ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా కుటుంబాలు తమ పిల్లల ఆనందాన్ని కోరుకుంటారు. ఈ సమయంలో వాటిని ఏ ధరకైనా కొనుగోలు చేయాలనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో బొమ్మల అమ్మకాలు  మంచి ఎంపిక అని అన్నారు.

ఈ సంస్థ 1760లో స్థాపించారు
బ్రిటిష్ బొమ్మల సంస్థ హేమ్లీస్ 1760 వ సంవత్సరంలో విలియం హామ్లే చేత స్థాపించబడింది. తరువాత ఇతర దేశాలకు వ్యాపించింది. ముకేష్ అంబానీ 2019లో దీనిని కొనుగోలు చేశారు.

click me!